విజయవాడ

హోదా ఇస్తామని మోసగించిన బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 5కోట్ల ఆంధ్రులను, ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాల అన్యాయం చేయడానికి చంద్రబాబు చేతకాని తనం, అసమర్థతే కారణం అని ఎపిసిసి ఉపాధ్యాయుడు ఎన్ తులసీరెడ్డి విమర్శించారు. ఎపిసిసి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడుతూ మన పొరుగు రాష్టమ్రైన తమిళనాడు సిఎం చట్టంలోని లేని వాటిని కూడా చెన్నైలో కూర్చుని సాధించుకుంటే... ఎపి సిఎం చంద్రబాబు చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం సీమాంధ్ర పౌరుషం ఉన్నా కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా పార్లమెంట్ భవనం ముందు నిరాహారదీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదా తాను అసమర్థుడిని, చేతకానివాడిని అని తనను క్షమించమని ప్రజలకు క్షమాపణ చెప్పి ఎపి సిఎం పదవి నుంచి తప్పుకుని ఆ పార్టీలోనే ఇతరులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బిజెపి అంటే భారతీయ మోసగాళ్ల పార్టీ
చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పడానికి బిజెపి ప్రభుత్వానికి 27 నెలలు పట్టిందన్నారు. ఇది కేంద్రంలోని ప్రభుత్వ పనితీరు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోసం చేసిందన్నారు. అన్యాయం చేసిందని అవమానపర్చిందన్నారు. హోదా ఇచ్చినంత మాత్రాన ఒక రాష్ట్రం అభివృద్ధి చెందదు అని అరుణ్‌జెట్లీ వ్యాఖ్యానించడం శోచనీమన్నారు. 2014 ఫిబ్రవరి 29న బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా ప్రత్యేక హోదాపై ఆధారపడి ఉందని రాజ్యసభలో చెప్పారని గుర్తు చేశారు. దీనిని ఆంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. లేక కేంద్ర మంత్రులకే అవగాహన లేదా అని ఎద్దేవా చేశారు.
కేంద్రానికి ధన్యవాదాలు ఎందుకు బాబు
రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా అరుణ్ జెట్లీ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ తన రక్తం మరిగిపోతోందని అన్న బాబు అదే నోటితో నిన్నటి రోజు శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయానికి ధన్యవాదాలు చెప్పాడు. ఇది రెండు నాలుకల ధోరణి కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం మరిగిపోయిందా, గడ్డ కట్టిందా, మరి ధన్యవాదాలు ఎందుకన్నారు. నాడు పార్లమెంటు సాక్షిగా ఎపి ప్రత్యేక తరగతి హోదా ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి ఉంటే ఎపికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేసేదన్నారు. ఇప్పటికైనా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ 2019 కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎఐసిసి ఉపాధ్యయుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, దీంతో జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో ఎపికి ప్రత్యేక తరగతి హోదాతో పాటు చట్టంలోని అన్ని అంశాలు అమలు అవుతాయన్నారు.