విజయవాడ

పోలీస్ కమిషనరేట్‌లో పాత.. కొత్త కలబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 13: పోలీసు కమిషనరేట్‌లో సిఐల బదిలీల పర్వంపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఊహించినట్టే పాతకాపులే తిరిగి అడుగుపెడుతున్నారు. పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ బదిలీల వ్యవహారంలో క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా రాజకీయ ఒత్తిళ్లు, సామాజిక వర్గం, సిఫార్సులు వంటి అంశాలు బదిలీలపై ప్రభావం చూపాయనడంలో అనుమానమే లేదు. ఏలూరు రేంజ్ నుంచి తొమ్మిది మంది సిఐలను విజయవాడ కమిషనరేట్‌కు కేటాయిస్తూ డిఐజి కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఈ తొమ్మిది మందిలో కొందరు గతంలో ఎస్‌ఐలుగా.. సిఐలుగా ఇక్కడ పని చేసి వెళ్లినవారే. మిగిలిన కొందరు కమిషనరేట్‌కు కొత్త ముఖాలే కావచ్చుగాని రాజకీయ సిఫార్సులు బాగానే పని చేశాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. కమిషనరేట్‌కు వచ్చేందుకు ఒత్తిళ్ల మధ్య ఇక్కడ పని చేయడం కత్తిమీద సాముగా భావిస్తున్న కొందరు సిఐలు ఆసక్తి చూపడం లేదనే వాదన తెర మీదకు వచ్చిన తరుణంలో ఇక విధి లేకే.. కొందరిని కొత్తవారిని, మరికొందరిని పాత వారిని తీసుకుంటూ తొమ్మిది మంది జాబితా విడుదలైందనే అభిప్రాయం ఉంది. దీంతో నవ్యాంధ్ర రాజధాని నగర పోలీసు కమిషనరేట్ పాత-కొత్త కలబోతగా మారింది. ఏది ఏమైనా..ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని పోలీసు కమిషనర్ అభిమతం మేరకు నడుచుకోవాల్సిందేనని ఇప్పటికే వారికి స్పష్టమైనట్లు తెలుస్తోంది. అసమర్థ, అవినీతి సిఐలుగా ముద్ర వేసుకున్న సిఐల్లో కొందరిని బయటకు పంపిన విషయం తెలిసిందే. పెనమలూరు సిఐ రాజేష్, కంకిపాడు సిఐ రాంకుమార్, కృష్ణలంక సిఐ మూర్తి, భవానీపురం సిఐ గోపాలకృష్ణ, సిసిఎస్ నుంచి రవికుమార్, ట్రాఫిక్ నుంచి వంశీకృష్ణలను కొద్దిరోజుల క్రితం సీపి ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేయగా ప్రస్తుతం ఆయా స్టేషన్‌లు భర్తీ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో కమిషనరేట్‌లో మిగిలిన స్టేషన్ల సిఐలకు సంబంధించి అంతర్గత మార్పులు కూడా చేయాల్సిన అవశ్యకతను సీపి భావించినట్లు సమాచారం. ఈక్రమంలో వచ్చే తొమ్మిది మందితో ఖాళీ అయిన ఆరు కొత్త స్టేషన్లను భర్తీ చేయడంతోపాటు, మార్పులు చేయాల్సిన స్టేషన్ల సిఐలను కూడా మార్చుతూ కమిషనరేట్ మొత్తాన్ని సంస్కరించనున్నట్లు తెలుస్తోంది. రేంజ్ నుంచి వస్తున్న తొమ్మిది మంది సిఐల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎండి ఉమర్, నూజివీడు సర్కిల్ నుంచి వి సుబ్బరాజు, అవనిగడ్డ సర్కిల్ నుంచి పి చంద్రశేఖరరావు, పశ్మిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టౌన్ సిఐ కాగిత శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి జివివి సత్యనారాయణ, కైకలూరు సిఐ జె మురళీకృష్ణ, ఏలూరు రేంజ్ విఆర్‌లో ఉన్న కె శ్రీ్ధర్ కుమార్, రాజమండ్రి అర్బన్ విఆర్‌లో ఉన్న ఎ శివాజీరాజు, కాకినాడు త్రి టౌన్ సిఐ ఎస్ ప్రసాదరావులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన రిలీవ్ ఉత్తర్వులు కమిషనరేట్‌కు చేరాయి. వీరిలో కొందరు సిఐలు శుక్రవారం కమిషనర్ కార్యాలయానికి వచ్చి సీపికి ‘సెల్యూట్’ చేసి వెళ్లారు కూడా. తొమ్మిది మంది సిఐల్లో ఎండి ఉమర్ గతంలో పెనమలూరు సిఐగా పని చేశారు. కె శ్రీ్ధర్‌కుమార్ ఏజిఎస్, గన్నవరం తదితర చోట్ల ఎస్‌ఐగా పని చేసి సిఐ పదోన్నతిపై సిఐడికి వెళ్లి ఇక్కడి నుంచి రేంజ్‌కు వెళ్లారు. ఏ శివాజీరాజు కూడా గతంలో నున్న రూరల్, సిసిఎస్ విభాగాల్లో పని చేశారు. ఇక ఎస్ ప్రసాదరావుకు కమిషనరేట్‌తో సుదీర్ఘ పరిచయమే ఉంది. ఈయన ఎస్‌ఐగా కొత్తపేట నుంచి మొదలై వివిధ స్టేషన్లలో పని చేసి ఆతర్వాత పదోన్నతి పొంది సిఐగా గవర్నర్‌పేట, కొత్తపేట, సత్యనారాయణపురం స్టేషన్లలో ఏబి వెంకటేశ్వరరావుకు ముందు పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాస్ హయాం వరకు పని చేసి అప్పుడే బదిలీ అయ్యారు. ఇక జె మురళీకృష్ణ విషయానికొస్తే ఈయన కూడా వన్‌టౌన్‌లో ఎస్‌ఐగా పని చేసి ఆ తర్వాత సిఐగా పెనమలూరు, ఇబ్రహీంపట్నం తదితర చోట్ల విధులు నిర్వహించి కొంతకాలం క్రితమే కైకలూరు సిఐగా వెళ్లి తిరిగి ఇప్పుడు మరలా కమిషనరేట్‌కు వస్తున్నారు. ఇక మిగిలిన నలుగురు మాత్రం కమిషనరేట్‌కు కొత్త ముఖాలే. ఇదిలావుండగా నగరంలోని వన్‌టౌన్, కొత్తపేట, సింగ్‌నగర్, నున్న రూరల్, ఇబ్రహీంపట్నం, సూర్యారావుపేట, మాచవరం, గన్నవరం, ఉయ్యూరులతోపాటు సిసిఎస్, ట్రాఫిక్ విభాగాల్లో పలువురు సిఐలకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. వీరిని మార్చుతూ కొత్తవారికి స్టేషన్లు కేటాయిస్తూ శని, ఆదివారాల్లో భారీ బదిలీల జాబితా విడుదల కానుంది.