విజయవాడ

రాజీవ్‌గాంధీ పార్కులో ప్లే ఐటమ్స్ నిర్వహణకు లీజు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 19: నగరంలోని విఎంసికి చెందిన రాజీవ్‌గాంధీ పార్కులో పిల్లలు ఆడుకునే ప్లే ఐటమ్స్ ఏర్పాటు నిమిత్తం పూర్వ లీజుదారుడికి మరో 11నెలల లీజు కాలాన్ని పొడిగించడంతోపాటు చెత్త రవాణా చేసే డంపర్ ప్లేసర్స్ మరమ్మతులకు అయ్యే ఖర్చులకు అనుమతించడమే కాకుండా పలు కీలక అంశాలకు విఎంసి స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. సోమవారం సాయంత్రం విఎంసి కౌన్సిల్ హాల్లో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తొలుత గత స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాలను ధ్రువీకరిస్తూ తీర్మానించారు. రాజీవ్ గాంధీ పార్కులో బంగీజంప్, క్రికెట్ జోన్ నిర్వహించే ప్లై ఐటమ్స్‌కు ఈ సంవత్సరం ఏప్రిల్‌తో లీజు గడువు ముగియగా నిబంధనల ప్రకారం 33.33శాతం లీజు మొత్తాన్ని పెంపుచేసి మరో మూడేళ్ల పాటు లీజు కాలాన్ని పొడిగించాలని కోరుతూ లీజు దారుడు ఎన్ జనార్థన్ చేసుకొన్న దరఖాస్తు మేరకు అధికారులు స్థారుూ సంఘ సమావేశానికి నివేదించగా కేవలం మరో 11 నెలల లీజు కాలాన్ని పొడిగిస్తూ సభ్యులు తీర్మానించారు. అలాగే విఎంసి భవనాలు, ఇతర ఆస్తుల వద్ద పనిచేస్తున్న 24 మంది సెక్యూరిటీ గార్డుల లీజు ముగియడంతో తదుపరి పిలిచిన టెండర్ ప్రక్రియలో సుమారు 6 సెక్యూరిటీ గార్డుల సరఫరా సంస్థలు పాల్గొన్న విషయంపై సభ్యులు తీర్మానాన్ని వాయిదావేశారు. అలాగే విఎంసి వెహికల్ డిపోకు చెందిన డంపర్ ప్లేసర్ వాహనాల మరమ్మతుల నిర్వహణకు వచ్చిన అంశాన్ని ఆమోదిస్తూ సభ్యులు తీర్మానం చేశారు. చెత్త రవాణాకు అవసరమైన వాహనాల మరమ్మతులు చేసిన పూర్తి సమాచారాన్ని తదుపరి సమావేశంలో నివేదించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వెహికల్ డిపోలో పనిచేస్తున్న 65మంది డ్రైవర్లు, 56 మంది క్లీనర్ల కాంట్రాక్ట్ కాలం ముగియడంతో వారి సేవలు విఎంసికి అవసరమైనందున వారి లీజు కాలాన్ని మరో 4 నెలల పాటు పొడిగిస్తూ ఆమోదించడమే కాకుండా వారి జీతాలకు చెందిన నగదు మొత్తం 74లక్షల 44వేల రూపాయలను విఎంసి జనరల్ ఫండ్ నుంచి వినియోగించుకునేందుకు పాలన పరమైన అంగీకారం తెలిపారు. అలాగే టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న అప్రెంటీస్‌గా పనిచేస్తున్న నలుగురు సిబ్బంది ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తూ తీర్మానం చేశారు. విఎంసి పాఠశాలలో యోగా టీచర్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కాంట్రాక్ట్ కాలాన్ని మరో 10 నెలలకు పెంచడమే కాకుండా ప్రస్తుతం అమెకు ఇస్తున్న 9 వేల 500 జీతాన్ని 13వేల 500లకు పెంచుతూ స్థారుూ సంఘం అమోదం తెలిపింది. ఈనెల 9వరకూ విఎంసికి జరిగిన జమా, ఖర్చులతోపాటు మేయర్, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్ల గౌరవ వేతనాలైన 2లక్షల 57వేల 900 రూపాయల బిల్లులలతోపాటు విఎంసి ఉద్యోగులు, పెన్షనర్లు దరఖాస్తు చేసుకొన్న పలు ఆర్థిక బిల్లులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. తొలుత స్టాండింగ్ కమిటీకి నూతన సభ్యులుగా ఎన్నికైన షేక్ నజీర్ హుస్సేన్, వి హరనాథస్వామి, అల్లు జలలక్ష్మీ, పైడి తులసీ, జి మహేష్, దోమకొండ జ్యోతితోపాటు వివిధ శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు.