విజయవాడ

దుర్గమ్మ సన్నిధి మొత్తం స్వర్ణమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి. సెప్టెంబర్ 25: పసిడికాంతులతోధగ ధగ మెరిస్తున్న శ్రీకనకదుర్గమ్మను బంగారు తలుపుల గుండాలోనికి వెళ్లి దర్శనం చేసుకునే భాగ్యం ఆదివారం నుండి భక్తులకు లభించింది. గతంలో కేవలం అమ్మవారి గోపురం మొత్తం స్వర్ణమయంగా ఉండేది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు గోపురాన్ని వీక్షించేవారు. వైజాగ్‌కు చెందిన ఒక భక్తుడు అమ్మవారి అంతరాయం, తలుపులు, వాటితోపాటు అంతరాలయం రెండు వైపుల గోడలకు సరస్వతీ, లక్ష్మీదేవి, ఇదేవిధంగా అమ్మవారి ప్రధాన ప్రవేశ ద్వారానికి పై భాగంలో ఉన్న గజలక్ష్మీ, ప్రధాన ద్వారం, అన్నింటిని స్వర్ణతాపడం పనులు చేయించారు. దీనికితోడు ఉత్సవమూర్తులకు రెండు వడ్డాణాలు, మూల విరాట్‌కు బంగారు పతకాల హారం, తదితర వాటిని అందజేశారు. దీంతో పసిడి ప్రధాన ద్వారం గుండా భక్తులు అంతరాలయంలోనికి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకొని రెండుగోడలకు రెండు వైపుల ఉన్న సరస్వతీ, లక్ష్మీ, దేవత మూర్తులను సైతం పసిడికాంతుల నడుమ దర్శించుకునే విధంగా వాటిని అమర్చారు. ఆలయంలోనికి ప్రవేశానికి ముందే స్వర్ణకాంతులతో ధగ ధగ వెలుగులతో దర్శనం ఇస్తున్న శ్రీ గజలక్ష్మీదేవి స్మరించుకొని భక్తులు అంతరాలయంలోనికి వెళ్లే విధంగా దాత ఈఏర్పాట్లు చేశారు. స్వర్ణమయ తాపడం పనులు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు మొత్తం కలిసి సుమారు కోటి రూపాయలు విలువ ఉంటుందని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు అంచనావేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాటిని పరిశీలించి స్వర్ణమయ ఆభణాలను ఇవో ఎ సూర్యకుమారికి అందజేశారు. ఈకార్యక్రమంలో దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శంకర శౌండిల్య, సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, ఇవో సిసి సతీష్, వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా స్వర్ణమయ దాత, మంత్రి దేవినేని తదితరులకు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. దుర్గమ్మకు ఉన్న ఆభరణాల జాబితాలోనికి ఆదివారం కొత్తగా రెండు బంగారు వడ్డాణాలు, రెండు బంగారు పతకాల హారాలు వచ్చి చేరాయి.