విజయవాడ

స్నాన ఘట్టాల వద్ద పార్కింగ్ చేసిన ట్రావెల్స్ బస్సులపై చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 7: షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫుడ్ కోర్టు స్టాళ్లను కలెక్టర్ బాబు ఎ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఘాట్ వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా పార్కింగ్ చేసిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పద్మావతి ఘాట్‌లో షాపింగ్ ఫెస్టివల్ లుక్ వచ్చేలా సుందరీకరించి పర్యాటకులతో పాటు కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఘాట్ వద్ద నున్న చెట్లకు విద్యుత్ బల్బులను అలంకరించి మంచి వెలుగులు జిమ్మే విధంగా ఏర్పాట్లు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు.
పున్నమి, భవానీ ఘాట్‌లలో పుష్కర పనులలో చేపట్టి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాలలో అక్కడక్కడ విరిగిన టైర్స్‌ను అమర్చాలని నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని కాంట్రాక్టను కలెక్టర్ ఆదేశించారు. పద్మావతి ఘాట్ వద్ద నిలువ ఉన్న వర్షపు నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహించిన శానిటరీ మేస్ర్తి ఎం.్ధనరాజ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్‌తోపాటు విఎంసి కమిషనర్ జి.వీరపాండియన్, విజయవాడ డివిజన్ ఇంఛార్జి, నూజివీడు సబ్ కలెక్టర్ జ.లక్ష్మీశా, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు పాల్గొన్నారు.