విజయవాడ

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, అక్టోబర్ 9: రసాయన ఎరువులతో కూడిన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయం మేలని రాబోయే కాలంలో రాష్ట్రప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పటమట మాతా టవర్స్ ఎదురుగా వల్లూరు ఆర్గానిక్ గార్డెన్స్‌లో ఎ.పి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం దారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల,ప్రదర్శన ముగింపు సభకు ఆదివారం ఉదయం ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం మంచి ధర కల్పిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో లక్ష ఎకరాలలలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రొత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల పదవీ విరమణ చేసిన అధికారి విజయకుమార్‌ను ప్రత్యేకంగా వ్యవసాయ ముఖ్యసలహాదారుగా నియమించటం జరిగిందన్నారు. నవ్యాంధ్ర రాజధానిలో రైతుల కోరిక మేరకు రైతు భవన్ నిర్మించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడతానని తెలిపారు.ప్రకృతి వ్యవసాయంతో భూమి ఆరోగ్యంగా వుంటుందన్నారు. రాష్ట్ర భారీనీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పొలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా పూర్తిచేసి రైతుల కళ్ళలో వెలుగు చూడాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలని అన్నారు. అందుకనే ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలలను కృష్ణానదికి తీసుకురావటం జరిగిందని, కృష్ణా, గోదావరి జలాలను పెన్నానదికి అనుసంధానం చేసి రాయలసీమను రతనాల సీమగా మార్చుస్తామని తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాలలో ఇరిగేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టటం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్నారు. ప్రతిపక్షనాయకుడు ప్రతి అభివృద్ధికి అడ్డుతగులుతూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. అంతకుముందు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను, సేంద్రీయ ఆహార పదార్ధాల పుడ్‌కోర్టును మంత్రి దేవినేని ఉమాతో కలసి మంత్రిపాటి పరిశీలించారు. అనంతరం రైతు సొసైటీ కరప్రతాన్ని మంత్రులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతునాయకులు యర్నేని నాగేంద్ర గో ఆధారిత వ్యవసాయ దారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.