విజయవాడ

ఇడుపులపాయ నుంచి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి... ఆ తరువాత ఆ హామీని గాలికొదిలేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, కాపుల పట్ల అనుసరించిన దురహంకార వైఖరికి నిరసనగా ఆయన సమాధి ఉన్న ఇ డుపులపాయ నుండి త్వరలో పాదయాత్ర ప్రారంభించబోతున్నామని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఆయన దురాగత, దురహంకార, అరాచక రాజకీయాన్ని కొనసాగిస్తున్న వైఎస్ కుమారుడు జగన్మోహనరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఈ పాదయాత్ర ముగుస్తుందన్నారు. గురివింద గింజ తన నలుపు ఎరుగనట్టు, కాపులకు ఇంత అన్యాయం చేసిన ఆ కుటుంబానికి చెందిన జగన్మోహనరెడ్డి ఇప్పుడు - కాపులకు అనేక విధాలుగా బాసటగా నిలబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అడ్డంగా ఒక శిఖండిని పెట్టి చేస్తున్న పోరాటంలోని అనైతికతను రాయలసీమ బలిజ సోదరుల దృష్టికి తీసుకురావడం కోసమే ఇడుపులపాయ నుండి ఈ పాదయాత్రను చేపట్టబోతున్నానన్నారు. రాయలసీమ బలిజ సోదరులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్, ఫ్యాక్షన్ పాదాల కింద దశాబ్దాల తరబడి నలిగిపోతున్నారన్నారు. 2014 ఎన్నికలకు రాయలసీమలోని 53 నియోజకవర్గాల్లో బలిజ సోదరులకు కేవలం 2సీట్లను మాత్రమే కేటాయించిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కాపుల కోసం పోరాటం అంటూ ఒక శిఖండిని ముందుకు తోస్తున్న తీరును బలిజ సోదరుల దృష్టికి తీసుకురావడమే నా లక్ష్యమన్నారు. ఇడుపులపాయలో త్వరలో మొదలుపెట్టనున్న ఈ పాదయాత్రకు రాయలసీమలోని బలిజ సోదరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జగన్మోహన్‌రెడ్డి అరాచకం పట్ల ఆవేదనతో ఉన్న పెద్దలు, పెద్దఎత్తున పాల్గొంటారని తాను ఆశిస్తున్నానన్నారు.

తుపాన్ల గండం తప్పితే మేలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 16: జిల్లాలో ముందుగా నాట్లు వేసిన వరి పొలాలు ఈనిక దశకు చేరుకోవటం, దానికితోడు వాతావరణం అనుకూలంగా ఉండటంతో గణనీయమైన దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈనిక దశలో వర్షం పడటంతో వరి గింజలు పాలుపోసుకోకపోవటం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గేవని, ఈ సంవత్సరం దానికి భిన్నంగా ముందుగా నాట్లు వేసిన వరి పొలాలు మొత్తం ఈనిక దశలో ఉండటం, వాతావరణం వేడిగా ఉండటంతో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
అయితే అక్టోబరు, నవంబరు నెలల్లో వాయుగుండాలు ఏర్పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. వాయుగుండాలు తప్పితే జిల్లాలో ఖరీఫ్ దిగుబడులు గణనీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎకరాకు రూ.40 బస్తాలకు పైగా దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.