విజయవాడ

‘మీ కోసం’ హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: ‘మీ-కోసం’కి హాజరుకాని జిల్లాస్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 2 నాటికి దేశంలో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా ప్రకటించాలని నిర్ణయించిందన్నారు. ఇకపై రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షిస్తారని తెలిపారు. జిల్లాలోని 500 గ్రామాలను ఈ ఏడాది డిసెంబర్ చివరకి ఓడిఎఫ్‌గా ప్రకటించాల్సి వుందన్నారు. పోతనపల్లి, చాట్రాయి, లోకుమూడి, పెదలంక, పొన్నూరులంక, మండమల్లి, పినగూడూరులంక, ఎదురుమొండి గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. మైలవరం ఎంఇవో రాజశేఖర్, ఇబిసి (ఆర్‌డబ్ల్యుఎస్) సీనియర్ అసిస్టెంట్ ప్రకాశరావుల ఇంక్రిమెంట్ కోతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కనీసం క్షేత్రస్థాయిలో జరిగే పనిపై అవగాహన లేనివారు క్షేత్రస్థాయిలో ఏవిధంగా పనిచేస్తారని గంధం చంద్రుడు అన్నారు. ‘మీకోసం’కు హాజరుకాని ఇరిగేషన్ ఎస్‌సి, ఆర్ అండ్ బి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎడి మార్కెటింగ్, ఇఈ స్పెషల్ డివిజన్, జోనల్ మేనేజర్ ఎపి ఎంఐసి, ఈడి మైనారిటీస్, ఎస్‌సి, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తదితర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ స్పష్టం చేశారు. పమిడిముక్కల మండలంలో 25 గ్రామాలు, మోపిదేవి మండలంలో 15 గ్రామాల్లో ఒక్కరికి కూడా పని కల్పించడంలో ఎంపిడివోల పనితీరు చూపుతుందన్నారు. జిల్లాలో గతంలో ఒకేరోజు లక్ష పనిదినాలు చూపామని, ఇప్పుడు ఆ స్థాయి 3వేలకు మాత్రమే ఉండడం పట్ల ఎంపిడివోలు, ప్రత్యేక అధికారుల నిబద్దత తెలుస్తోందని తెలిపారు.
ప్రజాసాధికారిత సర్వేలో నూజివీడు మున్సిపాలిటీ, విజయవాడ విఎంసి బాగా వెనుకబడి వున్నాయన్నారు. శనివారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి ఇదే స్థాయిలో పనిచేసే మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తప్పవన్నారు. 99 శాతం ఇళ్ల సర్వే, 73.2 శాతం జనాభా సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తున్నా క్షేత్రస్థాయి వివరాల్లో పూర్తిగా భిన్నంగా అధికారులు, సిబ్బంది పనితీరు చూపుతున్నారన్నారు. 645 మంది ఎన్యూమరేటర్లకు గాను 539 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. 9 మంది సర్కిల్ ఆఫీసర్లను (మానిటరింగ్ అధికారులు) నియమించామని విఎంసి అధికారులు వివరించారు. విజయవాడ సర్వే గణాంకాలు జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతుందన్నారు. తప్పులను సరిదిద్దడంలో కొందరు అశ్రద్ధ చూపుతున్నారని, 18 సంవత్సరాల్లోపు వున్నవారు ఉద్యోగం చేస్తున్నట్లు, ఒకే వ్యక్తి పేరు మీద 80 కరెంట్ కనెక్షన్ తదితర తప్పులపై వాస్తవంగా పరిశీలన చేపట్టి సరిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని అధికారుల నుంచి సంజాయిషీ తీసుకోండి అని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ తీరుపై ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవాలని, మంచిగా పనిచేయాలని గంధం చంద్రుడు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ ఇ-పట్టాదారు పాసుపుస్తకం, మ్యూటేషన్, మీ-సేవపై ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆర్డీవోలను వారి మండలాల వివరాలను సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. బందరు ఆర్డీవో డివిజన్ స్థాయి సమీక్ష చేస్తూ గూడూరు తహశీల్దార్‌ను ప్రగతిని సమీక్షించగా సమాధానం రాకపోవడంతో వివరాలను అడుగగా వీడియో కాన్పరెన్స్ జరుగుతుండగా గూడూరు తహశీల్దార్ వెళ్లిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించారు.