విజయవాడ

ముద్ర లోన్స్ బ్యాంకు ఖాతాలకు ప్రత్యేక క్యాంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: ముద్రా లోన్ బ్యాంక్ ఖాతాలను ప్రజలకు అందించడం ద్వారా చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులు, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల వరకు ఎటువంటి హామీలు, సెక్యూరిటీలు లేకుండా ఇవ్వనున్న రుణాలపై అవగాహన పెంచి రుణాలు అందజేస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా రూ. 10 లక్షల నుండి రూ. కోటి వరకు ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ఆర్థిక చేయూత అందజేస్తామన్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా బ్యాంక్ ఖాతాల ప్రారంభం, బీమా పథకాల ద్వారా భద్రతా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న వివిధ పథకాలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు నేరుగా అవగాహనకు డివిజన్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 31 వరకు బ్యాంక్ శాఖల పరిధిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉందని, ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 21, 28 తేదీల్లో బ్యాంక్ ఖాతా నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో మచిలీపట్నంలో అంబేద్కర్ భవనంలో, నూజివీడు టిటిడి కళ్యాణ మండపం, గుడివాలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్, పాత ప్రాంతీయ కార్యాలయం నందు ప్రజలకు అవగాహన పెంచేందుకు, బ్యాంక్ ఖాతాలను తెరిచేందుకు అన్ని శాఖల బ్యాంకర్లు అందుబాటులో ఉంటారన్నారు. జన్‌ధన్ ఎకౌంట్లను జీరో బ్యాలెన్స్‌తో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రారంభిస్తామన్నారు. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ప్రమాద పాలసీ కింద 12తో కుటుంబ, వ్యక్తిగత భద్రతా పథకం నమోదు ప్రక్రియ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ద్వారా రూ. 330 పథకంలో నమోదు, అటల్ పెన్షన్ యోజన కింద నమోదు ప్రక్రియ చేపడుతున్నామన్నారు.