విజయవాడ

ఎపిసిఆర్‌డిఏ ఓపెన్ ఫోరానికి 36 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ ఎపి సిఆర్‌డిఎ కార్యాలయంలో శుక్రవారం సత్వర అనుమతుల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 36 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 26 దరఖాస్తులను అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీ చేశారు. మరో 7 దరఖాస్తుదారులను అదనపు సమాచారం కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని మూడు దరఖాస్తులను తిరస్కరించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం నాలుగు దరఖాస్తులు రాగా రెండు దరఖాస్తులను అప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీ చేశారు. ఒక దరఖాస్తుకు సంబంధించి దరఖాస్తుదారుడిని అదనపు సమాచారం కోరారు. ఒక దరఖాస్తును తిరస్కరించారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం 13 దరఖాస్తులు రాగా వాటిలో 9 దరఖాస్తులను ఆమోదించి సర్ట్ఫికెట్లను జారీ చేశారు. నాలుగు దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. లేఅవుట్ల అనుమతుల కోసం ఆరు దరఖాస్తులు రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న 5 లేఅవుట్లకు అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రం మంజూరు చేశారు. ఒక దరఖాస్తుకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. గోడౌన్ల కోసం ఒక దరఖాస్తు రాగా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నందున వెంటనే ప్రాథమిక అనుమతి పత్రం జారీ చేశారు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ నిర్మాణ అనుమతుల కోసం ఎనిమిది దరఖాస్తులు రాగా సంబంధిత కమిటీ పరిశీలన, నివేదికల ఆధారంగా ఆరు దరఖాస్తులను ఆమోదించారు. ఒక దరఖాస్తుకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని ఒక దరఖాస్తును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఎపిసిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఓపెన్ ఫోరం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా భవన నిర్మాణదారులు వెంటనే అనుమతులు పొందేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ఎపిసిఆర్‌డిఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరక్టర్ వి.రాముడు, ప్లానింగ్ అధికారి సిహెచ్‌వి సాంబశివరావు, జోనల్ జాయింట్ డైరక్టర్ చక్రపాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.