కృష్ణ

అమరవీరుల రుణం అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: సమాజం కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం బలిపెడుతున్న పోలీసు అమర వీరుల రుణం తీర్చుకోలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్లాఘించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందే ఇక్కడకు వచ్చిన గవర్నర్ నరసింహన్ పరేడ్‌ను తిలకించి స్మారక స్తూపం వద్ద అమర వీరులకు ఘన నివాళి అర్పించి వెళ్ళారు. అనంతరం చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత అమరులు వీరు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వయంగా తన చేతితో డిబ్బిలో పోలీసు విరాళం ఇచ్చారు. పరేడ్ తిలకించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ఏడాది పోలీసు సంక్షేమ నిధికి 15కోట్లు ప్రకటించారు. ఇక వచ్చే ఏడాది నాటికి మంగళగిరి బెటాలియన్‌లో శాశ్వత స్మారక స్థూపం నిర్మాణం చేపట్టి ఇక అక్కడే అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించుకోనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాణాలు అర్పించిన 473 మంది పోలీసు అమరవీరులకు రాష్ట్రంలోని ఐదుకోట్ల ప్రజల తరుఫున ఘన నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలని వాటిని కాపాడే పోలీసులు ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడటం లేదన్నారు. సాంకేతిక పరిఙ్ఞన వినియోగంతో వారిపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు.
* సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : హోంమంత్రి-డిజిపి
హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో సమాజ రక్షణకు తమ సమయాన్ని, జీవితాన్ని త్యాగం చేయడంతోపాటు ప్రాణాలను సైతం అర్పించడం, విధి నిర్వహణ పట్ల వారికున్న అంకిత భావాన్ని తెలియచేస్తోందన్నారు. రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ సుస్ధిర శాంతి స్థాపనలో ఎదురయ్యే కఠిన సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కొంటూ పోలీసులు ప్రజలకు భద్రత కల్పిస్తున్నారన్నారు. ధైర్యానికి, ధీరత్వానికి పోలీసులు ప్రతిరూపమన్నారు. విధి నిర్వహణలో రాష్ట్రంలో ప్రాణాలు అర్పించిన 14మంది పోలీసులకు ఆయన ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* అమరవీరులకు గవర్నర్ నివాళి
హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పోలీసు అమర వీరుల సంస్మరణ స్మృతి పరేడ్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కంటే ముందుగా ఇందిరాగాంధీ స్టేడియంకు వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌లు ఘనస్వాగతం పలికి వేదికపైకి తోడ్కొని వెళ్ళారు. ఈసందర్భంగా విజయనగరానికి చెందిన 16వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పరేడ్ కమాండర్‌గా పరేడ్ నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులు వెంట రాగా.. పోలీసు గవర్నర్ అమరవీరుల స్మృతి ఫలకం వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. పోలీసు అమర వీరుల గౌరవార్ధం రెండు నిముషాల పాటు వౌనాన్ని పాటించారు. అనంతరం పోలీసు అధికారులు వెంటరాగా.. స్టేడియం నుంచి తిరుగుపయనమయ్యారు.
* స్మృతి ఫలకం వద్ద సీఎం నివాళి
పోలీసు అమరవీరుల స్మృతి ఫలకం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డిజిపి ఎన్ సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు 16వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వి వెంకటేశ్వరరెడ్డి పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ నివాళి సందర్భంగా ‘హెన్రీ ఫ్రాన్సిస్’ రచించిన ‘ఎబైడ్ విత్ మి’ పాటను పోలీసు బ్యాండ్ బృందం వినిపించిన తీరు ఆహుతుల్లో గంభీరమైన విషాద వాతావరణాన్ని నింపింది. పాటకు సంబంధించిన సారాంశాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంబడిపూడి మురళీకృష్ణ వివరించిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, జనవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌రావు, బొండా ఉమామహేశ్వరరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, ఏపిఎస్‌పి ఐజి ఆర్‌పి మీనా, అదనపు డిజిపి ఎన్‌వి సురేంద్రబాబు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, డిసిపి అశోక్‌కుమార్, ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.