విజయవాడ

ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 25: ఐటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎంజిరోడ్డులోని హోటల్ ఫార్చ్యున్ మురళి హోటల్ నందు ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర శాఖ - ఎఫ్‌ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా గత రెండు రోజుల నుండి నిర్వహిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సాంకేతికపరంగా ఐటిలోనూ ముఖ్యంగా ఇంటర్నెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సెమినార్‌ను నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువ ఇంజనీర్లు ఈ సెమినార్ ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ - గవర్నెస్, ఈ - వరల్డ్, ఈ - మార్కెట్, ఈ - అగ్రికల్చరల్ వంటివి ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మార్పులు ఇంకా రావాల్సి ఉందన్నారు. నేడు ప్రతిది ఎలక్ట్రానిక్‌మయం అవుతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా టెక్నాలజీపరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో చూస్తే మన రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు టెక్నాలజీని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. సెమినార్ కన్వీనర్, ఎఫ్‌ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దాసరి రామకృష్ణ మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ ప్రతి ఏటా విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంపొందించేందుకుగాను వివిధ ప్రాంతాల్లో సెమినార్ నిర్వహిస్తారన్నారు. ఏడాది నూతన రాజధాని విజయవాడ నగరంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సెమినార్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ ఇంజనీర్లు వచ్చారని, వారి అనుభవాలను నేటి యువ ఇంజనీర్లకు, విద్యార్థులకు తెలియజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమినెంట్ ఇంజనీర్ అవార్డును అవినాష్ చందూర్‌కు స్పీకర్ కోడెల అందజేశారు. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్‌లో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సుమారు 350 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చైర్మన్ ఎం కామరాజు, కార్యదర్శి శ్రీనివాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.