విజయవాడ

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: అన్ని రంగాల్లో వెనుకబడ్డ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని గురువారం గాంధీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో డైరక్టర్లతో పాటు పదవీ బాధ్యతలు స్వీకరించిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధానంగా గుంటూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన మైనార్టీ సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మైనార్టీ ముస్లింల సంక్షేమానికై ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రూ.710 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ముస్లిం యువతుల వివాహ సమయంలో ఆదుకునేందుకు గాను ఉద్దేశించిన రోషినీ పథకం అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం వివాహ సమయంలోనే నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలో రూ.50వేలు జమ అవుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 27వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాగా ప్రస్తుత ప్రభుత్వం ఆ భూములన్నింటినీ స్వాధీనపరచుకునే ప్రయత్నం చేస్తోందని ఆయా భూముల్లో వాణిజ్యపరమైన కాంప్లెక్స్‌లు నిర్మించి తద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింల సంక్షేమానికి వినియోగించడం జరుగుతుందన్నారు. పేద ముస్లింల జీవనోపాధికి తగిన విధంగా సహాయ పడగలనని హిదాయత్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. విజయవాడ, కడపలలో హజ్‌హౌస్‌ల నిర్మాణం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు జరగబోతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు రాయపాటి సాంబశివరావు, కేశినేని నాని, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, అనంతపురం, గుంటూరు జిల్లాల జడ్‌పి చైర్మన్లు చామన్, జానీమూన్, ఎమ్మెల్సీ అహ్మద్ బాషా, శాసనసభ్యుడు జలీల్‌ఖాన్, సీనియర్ నేత నాగుల్‌మీరా, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.