విజయవాడ

అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 14: దళిత, గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని విధాలా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. ఈసందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో దళిత, గిరిజన విద్యార్థులకు సంబంధించిన 4 కార్యక్రమాలను ప్రారంభించారు. ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహణకై ఈనెల 15 నుంచి డాల్జిలింగ్‌లో శిక్షణ తీసుకోబోతున్న 30 మంది విద్యార్థులను అభినందిస్తూ వారికి అవసరమైన కిట్స్‌ను అందించారు. అలాగే విదేశీ చదువులకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన మంత్రి రావెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమలుచేస్తున్న పథకాల వలన దళిత, గిరిజనుల జీవనం మెరుగుపడుతోందన్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా సామాజికంగాను, ఆర్థికంగాను వారికి తగు గౌరవం, హోదా లభించాలన్న లక్ష్యంతో నిరంతర శ్రమ పడుతున్నారన్నారు. సంక్షేమ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయడంతోపాటు విద్యా సంస్థల్లో కావాల్సిన వౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసి నాణ్యమైన బియ్యం, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. విద్యార్థుల్లో నూరు శాతం హాజరు ఉండేందుకు సూపర్ స్టూడెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి, తద్వారా 8 మంది విద్యార్థులను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లి స్టార్ హోటల్ బస ఏర్పాటుచేసి చారిత్రక ప్రాంతాల సందర్శన చేయిస్తామన్నారు. విదేశీ విద్యకు ఎంపిక చేసిన 160 మంది విద్యార్థులకు 10 లక్షల గ్రాంటు, 5 లక్షల బ్యాంకు రుణాన్ని అందిస్తున్నామన్నారు. ఎవరెస్ట్ విద్యార్థులకు తొలుత కేతనకొండలో తగు శిక్షణ ఇప్పించి ఎంపికైన వారిని డార్జిలింగ్ పంపుతున్నామన్నారు. సుమారు 10 మంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నార్నారు. క్రితం సారి వెళ్లిన వారు ఎవరెస్ట్ శిఖరంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఘనత రాష్ట్ర దళిత విద్యార్థులకే దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు ఎం రామారావు, అదనపు కార్యదర్శి చైతన్య తదితరులు పాల్గొన్నారు.