విజయవాడ

ఎపిసిఆర్‌డిఎ ఓపెన్ ఫోరంలో సత్వర అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6 దరఖాస్తులను అప్పటికప్పుడు క్లియర్ చేసి ప్రాథమిక అనుమతి పత్రాలు జారీ చేశారు. 3 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. రెండు దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేవని తిరస్కరించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం 3 దరఖాస్తులు రాగా ఒక దరఖాస్తుకు అప్పటికప్పుడే క్లియర్ చేసి ప్రాథమిక అనుమతి మంజూరు పత్రం జారీ చేశారు. మరో దరఖాస్తుకు అదనపు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎపిసిఆర్‌డిఎ పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం తగిన నిబంధనలకు అనుగుణంగా అన్ని పత్రాలు సమర్పిస్తే అదేరోజు ప్రాథమిక అనుమతి పత్రం మంజూరు చేస్తామని ఎపిసిఆర్‌డిఎ డాక్టర్ ఎ.మల్లిఖార్జున తెలిపారు. దాని ఆధారంగా నిర్ణీత ఫీజులు తనఖా దస్తావేజు వంటివి చెల్లించిన వెంటనే అనుమతిని ఇస్తామన్నారు. ఓపెన్ ఫోరం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా భవన నిర్మాణదారులు వెంటనే అనుమతులు పొందేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓపెన్ ఫోరంలో ఎపిసిఆర్‌డిఎ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున, డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ వి.రాముడు, ప్లానింగ్ అధికారి సిహెచ్‌వి సాంబశివరావు, జోనల్ జాయింట్ డైరెక్టర్ చక్రపాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.