విజయవాడ

కార్టూనిస్ట్ గొప్ప భావకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), నవంబర్ 20: సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను, సన్నివేశాలను హాస్యంగా మలిచి కార్టూన్ రూపంలో మనకు అందించి మనలో హాస్యం పుట్టించే కార్టూనిస్ట్ గొప్ప భావకుడని ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. హాస్యానందంగా సరదాగా సాయంత్రం కార్యక్రమం ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని ఒక హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ హాస్యంతో పాటు ఒక మంచి సందేశమిచ్చే ఒక గొప్ప కళ అని అంటూ కార్టూనిస్టులను ప్రశంసలతో ముంచెత్తారు. కెవివి సత్యనారాయణ పర్యవేక్షణలో వేదికపై అతిథులుగా డాక్టర్ సుదర్శనం, డాక్టర్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, బ్నిం, వి సుబ్బరాజు తదితరులు ఆశీనులు కాగా ఏవిఎమ్ అవార్డును ప్రముఖ కార్టూనిస్టు చక్రవర్తికి ప్రదానం చేశారు. కార్టూనిస్టు ఏవిఎమ్ వేదికపై అతిథులచే చక్రవర్తికి ఈ అవార్డును అందించారు.
తదుపరి అహా కంప్యూటర్ పోటీలో
విజేతలు కార్టూన్స్‌లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గాంధీ, కృష్ణ, వినోదలకు, కథల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పివి రామశర్మ, సరసి, రామశర్మలకు అందించారు. ప్రథమంలో ధ్వన్యనుకరణ చేసిన సిల్విస్టర్‌ను ఘనంగా అభినందించి సత్కరించారు. కార్యక్రమాన్ని రావెళ్ల తదితరులు నిర్వహించారు.