విజయవాడ

మరోసారి చెలరేగిన టేలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 20: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టి-20 సిరీస్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండవ టి-20లో 31 పరుగుల తేడాతో భారత్‌పై విజయాన్ని సాధించి మరో టి-20 మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. వెస్టిండీస్ కెప్టెన్ టేలర్ 45 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్‌కు విండీస్‌ను ఆహ్వానించింది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. 138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.1 ఓవర్లలో106 పరుగులకు అలౌటైంది. భారత జట్టులో మొదటి టి-20 ఆడే అవకాశాన్ని నగరానికి చెందిన ఎస్ మేఘన దక్కించుకుంది. తుది జట్టులో చోటు సాధించిన మేఘన బ్యాటింగ్‌లో 4 ఫోర్లతో 17 పరుగలు చేసి, ఫీల్డింగ్‌లో ఒక క్యాచ్‌ను పట్టింది. విండీస్ బ్యాటింగ్‌లో కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 47 పరుగులు, డాటిన్ 35 పరుగులు, మాథ్యూస్ 27 పరుగులు, మెరిస్సా 21 పరుగులతోరాణించి భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్లలో షీకాపాండే 2వికెట్లు, ఎక్తాబిస్త్, దీప్తిశర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ 43 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా ఎస్ మేఘన 17 పరుగులు, దీప్తిశర్మ 24 పరుగులు చేయగా మిగిలిన వారు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. విండీస్ బౌలర్లలో డాటిన్ 3 వికెట్లు, అనిసామహ్మద్ 3వికెట్లు, మాథ్యూస్ 2 వికెట్లు, షాక్వానా, షకీరాసెల్మాన్ చెరో వికెట్ పడగొట్టారు. .
స్కోర్ బోర్డ్
వెస్టిండీస్: హీలీమాథ్యూస్ 27, స్ట్ఫోనీ టేలర్ 47 నాటౌట్, కూపర్ 5, మెరిసా అక్వాలెరియా 21, డాటిన్ 35, క్యాసియానైట్ 0 (ఎక్స్‌ట్రాలు 2) 20ఓవర్లలో 137/5.
భారత బౌలింగ్: షీకాపాండే 2వికెట్లు, ఎక్తాబిస్త్ 1వికెట్, దీప్తిశర్మ 1వికెట్.
భారత్: స్మృతి మందానా 4, ఎస్ మేఘన 17, దీప్తిశర్మ 24, వేదా కృష్ణమూర్తి 5, హర్మన్‌ప్రీత్‌కౌర్ 43, షీకాపాండే 5, అనూజపాటిల్ 0, జులాన్‌గోస్వామి 3, ఎక్తాబిస్త్ 0, వర్వీన్ 1, ప్రీతిబోస్ 2 (ఎక్స్‌ట్రాలు 2) 18.1ఓవర్లలో 106/10.
వెస్టిండీస్ బౌలింగ్: డాటిన్ 3వికెట్లు, మాథ్యూస్ 2వికెట్లు, అనిసామహ్మద్ 3వికెట్లు, షకీరాసెల్మాన్ 1వికెట్, షాక్వానా 1వికెట్.