విజయవాడ

బ్యాంకులు, ఏటిఎంల వద్ద ధర్నాలు చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 20: బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ హెచ్చరించారు. రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ప్రజల సౌకర్యార్ధం ఆయా చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాని కొన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారని, ఇలాంటి వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందినవారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ వ్యతిరేకతను తెలియచేయాలంటే ధర్నా చౌక్ లేదా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా తమ నిరసనను నిర్వహించుకోవచ్చని సీపి సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి నిరసనలు తెలియచేసే స్వేచ్ఛ ఉందని, అలాంటి కార్యక్రమాలకు పోలీసు వ్యవస్ధ కూడా జవాబుదారీగ ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రధానంగా సామాన్య ప్రజాజీవనానికి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించుకోవాలని సూచించారు. అందుకు పోలీసుశాఖ సహకారం ఉంటుందన్నారు. కాని ఇందుకు భిన్నంగా రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించడం, భయానక వాతావరణం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, వాహనాల రాకపోకలను అంతరాయం కలిగించడంతోపాటు బ్యాంకులు, ఏటిఎం సెంటర్ల వద్ద ధర్నాలు, కార్యక్రమాలు చేపడితే పోలీసుశాఖ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.