విజయవాడ

రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని, అందుకోసం 3వేల 99కోట్ల రూపాయలు 43 ప్రభుత్వ శాఖలకు కేటాయించినట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐటిడిఏ పివోలు, డిడిలు, డిటిబ్ల్యూవోల సమీక్షలో సమావేశంలో ఆయన మాట్లాడారు. తరువాత మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ గిరిజనుల ఆదాయం పెంచడానికి, వారిలో నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని పారదోలడానికి గిరిజన సంక్షేమ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. గిరిజనులకు చేయూతనివ్వడానికి రాష్ట్రంలోని ఐటిడిఏలలో ఐఎఎస్ అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచి ఐటిడిఏలను బలోపేతం చేశారని, వీటిద్వారా అనేక నూతన ఉత్పత్తులను మార్కెట్‌ల్లోకి విడుదల చేస్తున్నామన్నారు. గిరిజనుల ద్వారా అడవిలో లభించే ముడిసరకును ప్రభుత్వం స్వీకరించి, వాటిని ఉత్పత్తులుగా మార్చి మార్కెట్‌లో అమ్ముతున్నట్లు తెలిపారు. గతంలో గిరిజనుల నుంచి కాఫీ ఉత్పత్తులు కొనటంలో మోసాలు చేసేవారని, ఇప్పుడు గిరిజన సహకార సంస్థ (జిసిసి) కాఫీ గింజలను నేరుగా అమ్ముతోందన్నారు. దీనిద్వారా గిరిజనులకు లాభం చేకూరడంతో పాటు, వారి ఆదాయాలను కూడా వృద్ధి చేసుకునే అవకాశం లభించిందన్నారు. ఇలా వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగయ్యాయన్నారు. కాఫీ గింజల కోసం లక్ష ఎకరాలు సేకరిస్తున్నామని, జీడిపప్పు, వాణిజ్య పంటలను పోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇలా గిరిజనులను వ్యవసాయంతో పాటు ఇతర పంటలను కూడా పండించేలా చర్యలు చేపట్టామని, దీంతో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. ఎక్కువ భాగం రాష్ట్రంలో గిరిజనులు వ్యవసాయంపైనే 95శాతం ఆధారపడి జీవిస్తున్నారని, రాబోయేకాలంలో సర్వీస్, పారిశ్రామిక రంగాల్లోకి వీరిని ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 7 లక్షల స్క్వేర్ ఫీట్‌తో 25 అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్స్ నెలకొల్పుతున్నామని, వీటిద్వారా స్కిల్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధికి శిక్షణ అందిస్తామన్నారు. గిరిజనుల కోసం అనేక నూతన పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గిరిజన తండాల్లో పిల్లలు పోషకాహార లోపంతో ఉంటున్నారని, వారికి గిరిపుత్రిక పథకంతో ఆదుకుంటున్నామని చెప్పారు. ఆడపిల్లలను పెంచడం కొద్దిమంది భారంగా భావించడంతో కల్యాణపుత్రిక పథకం ద్వారా 50వేల రూపాయలు నగదు రూపంలో అందిస్తున్నామని మంత్రి కిషోర్‌బాబు వివరించారు. సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.