విజయవాడ

సహకార వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిరంతరం శ్రమిస్తున్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. రద్దు చేసిన నోట్ల డిపాజిట్‌కు, నోట్ల మార్పిడికి సంబంధించి తొలుత అవకాశం కల్పించి, ఆకస్మికంగా అనుమతిని రద్దు చేస్తూ డిసిసి బ్యాంకులను మినహాయించడంలో గల ఆంతర్యం ఏమిటో ప్రధాని మోదీ, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉజిత్ పటేల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్‌బిఐ అనుమతితో, ఆర్‌బిఐ నిబంధనలకు లోబడి పనిచేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడుతున్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు నూరు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ కష్టజీవులకు దూరం చేయడానికి పరోక్షంగా కుట్ర జరుగుతోందని, ఆ వ్యవస్థను పరిరక్షించుకోడానికి, దాని మనుగడను కాపాడుకోడానికి ఉద్యోగ సంఘాలు చేపట్టిన పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలియజేయనున్నట్లు సిపిఐ, కార్మిక, ప్రజా సంఘాల, ఇతర బ్యాంక్ ఉద్యోగ సంఘాల, ఎన్జీవో సంఘాల , రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఎంప్లారుూస్ ఫెడరేషన్ (ఎఐసిబిఇఎఫ్) పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి. ఈ ప్రదర్శన మహాత్మాగాంధీ రోడ్డులోని కెడిసిసి బ్యాంకు కార్యాలయం వద్ద ప్రారంభమై పలు ప్రధాన వీధుల గుండా సాగి, గాంధీనగర్ అలంకార్ సెంటర్ ధర్నా పాయింట్ వరకు కొనసాగింది. ఈ ప్రదర్శనలో సహకార బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు వీరికి సంఘీభావంగా సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
ధర్నా పాయింట్‌లో ఎఐసిబిఇఎఫ్ ఉపాధ్యక్షుడు ఎవి కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎఐసిబిఇఎఫ్ అధ్యక్షుడు సిహెచ్ మాధవరావు మాట్లాడుతూ నోట్ల రద్దు, కొత్త నోట్ల మార్పిడి అనే కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కేంద్ర సహకార బ్యాంకులకు అశనిపాతంగా మారిందన్నారు. పాత నోట్ల డిపాజిట్, కొత్త నోట్ల మార్పిడుల నుండి ససకార బ్యాంకుల్ని ఎందుకు మినహాయించాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 369 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 14,000 బ్రాంచ్‌లు 65 శాతం డిపాజిట్లు కలిగి ఉన్నాయని ఈ సహకార బ్యాంకులను పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని లేని పక్షంలో ఈ నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కష్టజీవుల కోసం పనిచేసే సహకార బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాట పడితే, వాణిజ్య బ్యాంకుల సిబ్బంది విధుల్లో తల మునకలై ఉన్నారన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని రామారావు మాట్లాడుతూ సహకార బ్యాంకుల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. ఎపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు , జిల్లా పశ్చిమ శాఖ అధ్యక్షుడు ఎవి విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ తర్వాత పార్లమెంటు ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేస్తున్న అతి పెద్ద సమస్యగా ఈ నోట్ల మార్పిడిని వర్ణించారు. ఈ సభలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి, ఆంధ్రా బ్యాంకు నాయకులు కొండలరావు, కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు, సహకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.