విజయవాడ

ప్రభుత్వ ఆయుర్వేద డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: ఐదు దశాబ్దాలుగా కష్టాలను ఎదుర్కొంటున్న స్థానిక డాక్టర్ నోరి రామశాస్ర్తీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు మహర్దశ పట్టింది. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కారణంగా ఇటీవల వరుసగా రెండేళ్లపాటు డిగ్రీ, పిజి కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపేశారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషితో అడ్మిషన్లను పునరుద్ధరించారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ సభ్యులు ఇప్పటికి పలుమార్లు కళాశాలను సందర్శించి అనేక సూచనలు ఇచ్చారు. ఈ కమిటీలో సభ్యుడైన డాక్టర్ మల్లు ప్రసాద్ ఆయుర్వేద వైద్యాధికారుల సంఘంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి కావటంతో ఈ కళాశాల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే విద్యార్థులతో కలిసి గత ప్రిన్సిపాల్ కెఎంవిఎ ప్రసాద్, వైద్యాధికారుల సంఘ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కళాశాల అధ్యాపకులు డాక్టర్ జి బుల్లయ్య నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయవాడ వాసి డాక్టర్ జివి పూర్ణచంద్ వంటివారు మంత్రి కామినేని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో డిగ్రీ విభాగంలో ఉన్న 30 సీట్లను ఒకేసారి 60 సీట్లకు పెంచడం అటుంచి కొత్తగా ఐదేసి సీట్లతో కాయ చికిత్స, ప్రసూతి, తంత్ర ద్రవ్యగుణ పిజి కోర్సులకు కూడా కేంద్రం మంగళవారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన సీట్లను 2016-17 విద్యా సంవత్సరం నుంచి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ద్వారా కౌన్సిలింగ్‌తో భర్తీ చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ఫిలిప్ ఆనందకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం డాక్టర్ జివి పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయుర్వేద వైద్యులు సీట్ల పెంపు, కొత్త కోర్సులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కామినేని, వైద్య సలహాదారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు, సిపిఐఎం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సువిశాల ప్రాంగణంలో నూతన కళాశాల భవనాలను ఏర్పాటు చేసి 500 బెడ్లతో సకల సదుపాయాలతో అనుబంధ ఆసుపత్రి ఆయుర్వేద ఫార్మసీలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే ఒక అత్యున్నత కళాశాలగా దీన్ని తీర్చిదిద్దాలంటూ ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో ఆయుర్వేద వైద్యులు కెవి రమణరాజు, సిఎన్ మూర్తి, కెఎస్ చలపతిరావు, ఎవిఎస్‌కె ప్రసాదరావు, పివిఎన్‌ఎస్ కుమార్, జి బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.