విజయవాడ

గ్యాస్ పైప్‌లైన్ సంరక్షణ అందరి కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 2: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) ఎల్‌పిజి పైపులైన్ సంరక్షణ అందరి కర్తవ్యం, బాధ్యత అని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. భవానీపురం హరితాబెరం పార్కులో శుక్రవారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్‌పిజి గ్యాస్ పైప్‌లైన్ భద్రత, సంరక్షణపై జిల్లా అధికారులకు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు సుమారు 589 కిలోమీటర్లు ఎల్‌ఫిజి పైప్‌లైన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ పైప్‌లైన్ దేశం సంవృద్ధి మరియు అభివృద్ధికి చేయూతనిస్తుందని, దీని ద్వారా వంటగ్యాస్ సప్లై చేయటం జరుగుతుందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని గ్రామాలలో పైప్‌లైన్ భద్రత, సంరక్షణపై పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన బాధ్యత గెయిల్ సంస్థపై ఉందన్నారు. ముఖ్యంగా యువత దీనిపై అవగాహన కలిగి ఉండి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు పైప్‌లైన్ భద్రత, సంరక్షణను సమన్వయంతో నిర్వహించుకొని ఎటువంటి సంఘటన జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పైప్‌లైన్ ఉన్న ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 15101కు తెలపాలని అధికారులను కలెక్టర్ కోరారు. సదస్సులో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే రక్షణ పరికరాలను ప్రదర్శించి, పనితీరును కలెక్టర్‌కు వివరించారు. సదస్సులో గెయిల్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్ కిషోర్ సింఘాల్, హెచ్‌ఓడి ఎ.సురేష్‌బాబు, సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్, కంపెనీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.