విజయవాడ

జాతీయస్థాయి బాడ్మింటన్ టోర్నీ.. సెమీస్‌కు సాయివిష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 4: కృష్ణాజిల్లా బాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని మూడు స్టేడియాల్లో జరుగుతున్న డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జా తీయస్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్,డబుల్స్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది. అండర్-13 బాలుర విభాగంలో పోటీపడుతున్న జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కుమారుడు డబుల్స్ విభాగంలోపి సాయివిష్ణు, జి ప్రణవ్‌తో కలిసి ఎం ధర్మజ్జా, టి రుషేంద్రల జోడిపై 21-12,21-9తేడాతో గెలుపొం ది సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. బాలు ర అండర్-13సింగిల్స్ విభాగంలోక్వార్టర్ ఫైనల్స్‌లో ఫాజీం (కేరళ)పై 21-15,17-21,21-11 తేడాతో ఎస్ శం కర్‌ముత్తుస్వామి (తమిళనాడు), భరత్ (హర్యానా)పై 18-21,21-16,21-12 తేడాతో ఆర్‌కె ఉపనాంద, ప్రణవ్‌శర్మపై 21-19,18-21,21-15 తేడాతో బివి ఉనిత్‌కృష్ణ (తెలంగాణ), తన్మయ్‌బికాష్ (అస్సాం)పై 21-13,21-7 తేడాతోజి ప్రణవ్‌రావు (తెలంగాణ)లు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. బాలికల అండర్-13 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో అవాంతిక పాండేపై 21-15,21-18 తేడాతో ఎం మేఘనరెడ్డి (తెలంగాణ), విలిందాఛానుపై 21-10, 21-18 తేడాతో హ్రిషాదుబె (మహరాష్ట్ర), ఇష్రాని (అస్సాం)పై 21-14, 21-18 తేడాతోఅనుపమ ఉపాధ్యాయ, తనీషాసింగ్ (ఉత్తరప్రదేశ్)పై 21-13, 21-8 తేడాతో తన్సిమ్ (గుజరాత్)లు గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నారు. బాలుర సింగిల్స్ అండర్-15 క్వార్టర్ ఫైనల్స్‌లోగౌతమ్‌వాలియా (హర్యానా) పై 21-15,18-21,21-13తేడాతో జైదిత్యప్రతాప్‌సింగ్ (్ఛత్తీస్‌ఘడ్),ఎస్ కౌశి క్ (తమిళనాడు)పై 21-15,21-13 తేడాతో తుకుంలా, ఇషాన్ (్ఛత్తీస్‌ఘడ్)పై 21-16,22-24,21-17 తేడాతో బిద్యాసాగర్ సలాం, రోషన్ గుర్బని (మహరాష్ట్ర)పై 21-16,21-11తేడాతో ప్రియాన్‌షురజవత్ (మధ్యప్రదేశ్)లు గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో జైదిత్య ప్రతాప్‌సింగ్ (్ఛత్తీస్‌ఘడ్)పై 21-19,21-17 తేడాతో తుకుంలా, బిద్యాసాగర్ సలాంపై 16-21,21-14,21-14 తేడాతో ప్రియాన్‌షు రాజవత్ విజయంసాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. అండర్-15 బాలికల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో మేధాశశిధరన్ (కర్నాటక)పై 21-12,21-12తేడాతోఉత్సవ(పశ్చిమబెంగాల్), త్రిశజోల్లి (కేరళ)పై 17-21, 21-12,21-15 తేడాతో స్నేహ, మాన్సిసింగ్ (ఉత్తరప్రదేశ్)పై 21-18, 26-24 తేడాతోనిఖితశర్మ (హర్యానా), కేయుర (తెలంగాణ)పై 17-21,21-19, 21-11 తేడాతో ఎస్ కవిప్రియలు విజయంసాధించి సెమీస్‌కు అర్హత సాధించారు. సె మీస్‌లో స్నేహపై 21-12, 16-21, 21-13తేడాతోఉత్సవ, నిఖితశర్మపై 14- 21,21-14,21-11తేడాతోఎస్ కవిప్రియ లు గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకున్నా రు. శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండోర్ స్టేడియం, విజయవాడ క్లబ్, డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 4: మథురానగర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈమహోత్సవాలు మూడు రోజులు పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందులోభాగంగా ఆదివారం ఉదయం విఘ్నేశ్వర పూజతో ఈమహోత్సవాలు ప్రారంభమైయ్యాయి. కలశాలతో కావడి ఉత్సవం మధురానగర్ పుర వీధీల్లో జరిగింది. ఈసందర్భంగా స్వామివార్లకు మంగళ స్నా నం, జలభిషేకం, అభిషేకం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈవైదిక కార్యక్రమాలను ఆలయ పండితులు గంగాధర ప్రసాద్ శర్మ, వీరరాఘవ శర్మ, తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు బోయిన వేంకటేశ్వరరావు, సరోజ దంపతులు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.