విజయవాడ

రాజకీయ పార్టీగా మాల మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో 75 లక్షలకు పైగా జనాభా కలిగిన ఏకైక అతిపెద్ద కులమైన మాలల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం చేసి అంబేద్కర్ ఆశయమైన రాజ్యాధికారం కోసం మాల మహానాడును రాజకీయ పార్టీగా తీర్చిదిద్దబోతున్నట్లు మాల మహానాడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు యర్రమళ్ల రాములు, పంతగాని రమేష్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే శ్రమిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చే రాజకీయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ‘చలో విజయవాడ’ పేరిట ఆదివారం నగరంలో భారీ ర్యాలీ, అనంతరం ధర్నా చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రాజ్యాంగ ఫలాలు 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ సక్రమంగా అందించకుండా నిర్లక్ష్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా తమ పార్టీ ముందుకు దూసుకెళుతుందని వారన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతామని రమేష్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అన్ని పార్టీలు గౌరవించాలన్నారు. కొత్త కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని, తెలుగుదేశం పార్టీ సర్వే ఆధారంగా తెల్ల రేషన్ కార్డులను ఎత్తివేసే కుట్రలను విరమించుకోవాలని, వార్షిక ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని 10 నుంచి 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ఎస్సీ, ఎస్టీలకు పంచాలన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు, భద్రత కల్పించాలని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని, నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేశారు. సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుందా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, బి రాధా దేవదాసు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఫ్రాన్సిస్, కర్నూలు అధ్యక్షుడు కుమారస్వామి, రమణ (చిత్తూరు), సామేలు (తూ.గో), బి సత్య (ప.గో), సురేష్‌బాబు (అనంతపూర్), మధు (ప్రకాశం) తదితరులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మాల మహానాడు కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు.