విజయవాడ

కృష్ణా మహిళల హ్యాండ్‌బాల్ టోర్నీ ఆంధ్రా లయోలా కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, డిసెంబర్ 5: కృష్ణా విశ్వవిద్యాలయం (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఆంధ్రా లయోలా కైవసం చేసుకుంది. కాకరపర్తి భావనారాయణ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అం తర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ సోమవారం ఆ కళాశాల ప్రాంగణంలో జరిగింది. జిల్లాలోని ఐదు కళాశాలలకు చెందిన మహి ళా హ్యాండ్‌బాల్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. అందులో ఫైనల్స్‌లో పోటాపోటీగా ఆడిన కాకరపర్తి భావనారాయణ కళాశాలపై, ఆంధ్రా లయో లా కళాశాల మహిళా హ్యాండ్‌బాల్ జట్టు విజయం సాధించింది. ఆంధ్రా లయోలా కళాశాల ప్రథమ, కాకరపర్తి భావనారాయణ కళాశాల ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. సిద్ధార్థ మహిళా కళాశాల తృతీయ స్థానంలో నిలిచింది. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరై క్రీడాకారులను హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు.
క్రీడలతో మానసిక వికాసం
క్రీడలతో మానసిక వికాసం సాధ్యమవుతుందని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం మహిళల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ముగింపు సభ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించటం వలన అనేక ప్రయోజనాలను అందుకోవచ్చన్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల సాంబశివరావు, ఎస్.రజిత్‌కుమార్‌లు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తమ కళాశాల యాజమాన్యం పలు వసతులను కల్పిస్తుందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్రీడా విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ప్రారంభోత్సవ సభకు ఏలూరు రేంజ్ స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ, పూర్వ విద్యార్థి ఎం.సుధాకర్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సిజర్‌రెడ్డి అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, కళాశాల ఫిజికల్ డైరక్టర్ డాక్టర్ ఎం.సాంబశివరావు, పూర్వ ఫిజికల్ డైరక్టర్ నరేంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.