విజయవాడ

మత్స్యకారులకు మరింత మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: జీవన భృతి కోసం భూమికి దూరంగా నడి సముద్రంలో రోజుల తరబడి గడిపే మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. కుటుంబాలను వదిలి ఒక్కోసారి వారాల తరబడి ఉండిపోయే మత్స్యకారులకు నిత్యం జీవన పోరాటమేనని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి వారి జీవన విధానాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పదహారు ఉప కులాలు ఒకే తాటిపైకి వచ్చి సమైక్య సంక్షేమ సంఘంగా ఏర్పడిన సందర్భంగా బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. వారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి మత్స్యకారులకు ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మత్స్యకారులు తమకు అండగా ఉంటూ వచ్చారని అంటూ రూ. 42.28 కోట్ల ఏపి స్టేట్ కోఆపరేటివ్ ఫిషర్‌మెన్ సొసైటీస్ ఫెడరేషన్ ఆఫ్ కాఫ్ రుణాలను మాఫీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. జాలర్లు వేటకు విరామం ప్రకటించిన కాలానికి జీవన భృతి కోసం ఒక్కొక్కటికీ రూ. 4వేల చొప్పున సహాయం అందిస్తున్నామని, దీనివల్ల 80 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. సబ్సిడీ మీద అనేక పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. బేస్త సామాజిక వర్గానికి ఎనలేని ప్రయోజనాలు కల్పించి తమను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చామని సమైఖ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. వీరికోసం లోగడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 4 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు అయ్యాయని, ఇటీవల కొత్తగా మరో 6 ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించామని బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ముంపు బాధితులందరికీ ఒకే రీతిలో పరిహారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధిత రైతులకు ఉభయ గోదావరి జిల్లాలో ఒకే రీతిలో పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన భూములు కోల్పోతున్న రైతులు శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసి తమకు పరిహారంగా ఎకరా భూమికి రూ. 6 లక్షలు చొప్పున అందివ్వాలని అభ్యర్థించారు.