విజయవాడ

ప్రభుత్వ హామీల అమలు సంతృప్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: దేశంలోనే మన రాష్ట్రం 10.99 శాతంతో రెండంకెల వృద్ధి సాధించి మొదటిస్థానంలో నిలిచామని రాష్ట్ర విధాన మండలి హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రెండు రోజులపాటు నగరంలోని సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల హామీలను కమిటీ సమీక్షించింది. వ్యవసాయం, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్థిక, టూరిజం, విద్యాశాఖలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు జరిపిన విధానాన్ని సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న రుణాలలో రూ. 50వేలు తీసుకున్న రుణాలను రద్దు చేసిందన్నారు. జిల్లాలో 4.40 లక్షల మందికిగాను 2.90 లక్షల వరకు రుణాలు రద్దు చేశామన్నారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలకు మొదటి విడతగా వారి సంఘానికి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున జమ చేశామని, రెండవ విడత రుణ మాఫీని నేరుగావారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేసామన్నారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ అందిస్తున్నామని భవిష్యత్‌లో దీనిని 9 గంటలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. జిల్లాలో ఇ-పోస్ విధానంలో అమలు చేస్తున్న ఎరువుల పంపిణీని దేశ వ్యాప్తంగా మెచ్చుకుని అమలు చేసుకుంటున్నారన్నారు. చౌకధరల దుకాణాల్లో ఇ-పోస్ విధానాలు అమలు చేసి అసలైన లబ్ధిదారులకే సరుకులు అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు కేటాయించిన ఉర్దూ టీచర్ల ఖాళీలను వారికే కేటాయించాలని ఇందుకు వారికి ఉర్దూ నేర్పించాలని కమిటీ నిర్ణయించిందన్నారు. కనకదుర్గ గుడి వద్ద రహదారి ట్రాఫిక్ సమస్యలు లేకుండా వెడల్పు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల పంపిణీని, ఆధార్ అనేబుల్ ఫర్టిలైజర్స్ పంపిణీ విధానం మోడల్‌గా అమలు చేస్తున్నామని, ఈ విధానాన్ని దేశంలోనే 16 జిల్లాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 1262 మంది బిజినెస్ కరస్పాండెంట్లు ప్రతి గ్రామం, వార్డులో వున్నారని వివరించారు. తొలుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రజాసేవలో జయలలిత దూరదృష్టి కలిగిన మహా నాయకురాలని, ఎన్నో సవాళ్లన అధిగమించారని పేర్కొన్నారు. కమిటీ సమావేశంలో సభ్యులు పిజె చంద్రశేఖర్, పి సుధాకర్‌బాబు, బుద్దా వెంకన్న, జెసి గంధం చంద్రుడు, అదనపుకమిషనర్ హరికుమార్, సబ్ కలెక్టర్ సలోని సిదాన పాల్గొన్నారు.