విజయవాడ

మరో ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: ఎపి సిఆర్‌డిఏ పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం కింద నిర్ణీతకాలంలో రెగ్యులరైజ్ కాని దరఖాస్తుల క్లియరెన్స్‌కు మరో అవకాశం ఇస్తున్నట్టు కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. ఇంతకుముందు కొంత ఫీజులు చెల్లించిన, ఇంకా చెల్లించాల్సిన దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2017 ఫిబ్రవరి 28లోగా పరిష్కరించుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2007లో జీవో జారీ చేయగా, దీని ప్రకారం 2008లో ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద అనుమతిలేని లేఅవుట్ల వారినుంచి దరఖాస్తులను స్వీకరించారన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుతో పాటు 2007 డిసెంబర్ 31 నాటి మార్కెట్ రేటు ప్రకారం పీనల్ ఎవౌంట్, దస్తావేజు మార్కెట్ విలువలో 14శాతం ఖాళీ స్థలం విలువను చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం దరఖాస్తు సమయంలో చెల్లించగా మిగిలిన మొత్తాన్ని 6నెలల్లో చెల్లించే నిబంధన ఉందన్నారు. వ్యక్తిగత డిక్లరేషన్ ద్వారా లైసెన్స్‌డ్ సర్వేయర్‌తో పీనల్ ఎవౌంట్, ఓపెన్ స్పేస్ రుసుమును లెక్కించి చెల్లించాల్సి ఉందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద ఎపిసిఆర్‌డిఎ పరిధిలో మొత్తం 16వేల 570 దరఖాస్తులు రాగా వాటిన్నింటినీ 2013 నవంబర్ 30లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. దరఖాస్తుతోపాటు చెల్లించిన మొత్తం పోను మిగిలిన రుసుమునకు వాటికి సంబంధించిన పత్రాలు అందజేయడానికి, ప్రొసిడింగ్స్ రిలీజ్ చేయడానికి 2013 నవంబర్ 30 ముగింపు తేదీ కాగా ఫీజులు చెల్లింపులు, తగిన పత్రాలను సక్రమంగా సమర్పించకపోవడంతో మరో 6నెలల గడువులోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించలేకపోవడం జరిగిందన్నారు. అయితే ఈ గడువులోగా పూర్తి చేసిన 11,178 ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్‌లను క్లియర్ చేయగా ప్రొసెస్ పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉన్న 95 దరఖాస్తులను పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై వచ్చిన అభ్యర్ధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు మరో 5,297 పెండింగ్‌లో ఉండగా వీటిని పరిష్కరించేందుకు 2016 నవంబర్ చివరి తేదీ ముగింపు తేదీగా నిర్ణయించామన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా 14శాతం చెల్లించి తమ లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.