విజయవాడ

అంబేద్కర్ స్ఫూర్తితో.. దళితుల అభ్యున్నతే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: ‘నా జాతి ప్రజలకు కనీసం మానవ హక్కులను సాధించకపోతే నేను తుపాకీతో కాల్చుకుంటా’నని బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతి హక్కుల కోసం అన్నారని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ 60 వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అంబేద్కర్ దళిత జాతుల హక్కుల కోసం మహద్ చెరువు నీళ్లతో తన పోరాటం మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పటికీ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ ఫలాలు కొద్దిమందికే అందుతున్నాయని తెలిపారు. దళితులు ఆర్ధికంగా ఎదగాలని, వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని, ఉద్యోగ కల్పనలో ముందుకు రావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో దళితుల కోసం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల జెడిలు ప్రసాద్, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
భారీ గుట్కా నిల్వలు స్వాధీనం
* గోడౌన్‌లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
విజయవాడ (క్రైం), డిసెంబర్ 6: పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలోని గుట్కా గోడౌన్‌లో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం.. యనమలకుదురులోని ఇందిరానగర్‌లో గుట్కా నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసిపి నేతృత్వంలో సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా గుట్కా బస్తాలు గుర్తించారు. గోడౌన్‌కు చెందిన తాడేపల్లిగూడెం నివాసి మల్లేశ్వరరావు, ప్రసాద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని మొత్తం 9లక్షలు రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.