విజయవాడ

మెట్రోరైలు డిపో భూమికి న్యాయబద్ధంగా నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: నిడమానూరులో మెట్రోరైలు డిపో నిర్మాణానికి గుర్తించిన భూములకు నష్టపరిహారం న్యాయబద్ధంగా చెల్లించేలా జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు రైతులకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మెట్రోరైలు డిపో నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న నిడమానూరు వాసులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్నవారిని నష్టపరిచే ఉద్దేశ్యం లేదన్నారు. అభివృద్ధిపరంగా మెట్రోరైలు నిర్మాణం అవసరం వున్నందున భూయజమానులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టును అమరావతి నగరానికి తెచ్చారన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ స్వతంత్రంగా ఎక్కడెక్కడ నిర్మాణాలు చేయాలనే దానిపై సర్వే చేసి ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పించిందన్నారు. డిపిఆర్‌లో జిల్లా యంత్రాంగం పాత్ర వుండదని ఇన్‌చార్జి కలెక్టర్ రైతులకు వివరించారు. నష్టపరిహారం చట్టప్రకారం చెల్లిస్తామని, రైతులు తమ నిర్ణయాలను తెలిపే అవకాశం వుందని గంధం చంద్రుడు వివరించారు. సమావేశంలో విజయవాడ రూరల్ తహశీల్దార్ మదన్‌మోహన్, మెట్రోరైలు డిపో నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పాల్గొన్నారు.
రేషన్ షాపు పరిశీలన
తొలుత ఇన్‌చార్జి కలెక్టర్ చంద్రుడు నగదు రహితంగా చౌకధరల దుకాణాల ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీని విద్యాధరపురం షాప్ నెం.15లో పరిశీలించారు. ఈసందర్భంగా షాపులో నగదు రహితంగా జరుగుతున్న లావాదేవీలను పరిశీలించారు. షాప్ పరిధిలోని తెల్ల రేషన్ కార్డుదారుడైన అప్పారావు నగదు రహితంగా నిత్యావసర సరుకులు తీసుకోవటం సులువుగా వుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ను అభినందించారు.

టీచర్స్ సర్వీస్ రూల్స్ ఉత్తర్వులపై హర్షం

విజయవాడ, డిసెంబర్ 8: ఎంతోకాలంగా రాష్ట్రంలోని మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న మున్సిపల్ సర్వీస్ రూల్స్ ఉత్తర్వులు జారీపై మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎంటిఎఫ్) రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ ఇమాంబాషా గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇంతకుముందు రాష్ట్రంలోని అందరు మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, చైర్మన్‌లు ఇష్టానుసారం టీచర్లను బదిలీ చేసేవారని, ప్రమోషన్లు ఇచ్చేవారని, ఇప్పుడు విడుదల చేసిన జీవోల ప్రకారమే అన్ని నిర్ణయాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి, జీవోల విడుదలకు అహర్నిశలు కృషి చేసిన ఎంటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణకు బాషా కృతజ్ఞతలు తెలిపారు.