విజయవాడ

క్షేత్ర స్థాయి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: విజయవాడ భవానీపురం, గొల్లపూడిలో ఉన్న దర్గా హజరత్ గాలిబ్ షాహీబ్ వక్ఫ్ భూములకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ప్లాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే తదుపరి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రుల బృందం నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన మంత్రులు యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కె.ఇ.కృష్ణమూర్తి, అధికారులు సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం ఈ వివరాలను మంత్రి పల్లె విలేఖరులకు వివరించారు. దర్గాకు చెందిన 35.2 ఎకరాల భూములను మహమ్మదీయ సహకార హొస్ బిల్డింగ్ సోసైటీకి విక్రయించారని తెలిపారు. 433 ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేశారన్నారు. అందులో 261 ప్లాట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, మిగిలిన 172 పాట్లను నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసినట్లు గుర్తించామన్నారు. ఒక కుటుంబలో ఇద్దరికి, ఒకరికి ఎక్కువ స్థలం కేటాయించడం వంటివి తమ కమిటీ దృష్టికి వచ్చాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్లాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీంచేందుకు నిర్ణయించామన్నారు. ఆ నివేదిక ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నాలుగు వారాల్లోగా నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాల్లో
భోజనాలు అదిరిపోవాలి
* ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు

విజయవాడ, డిసెంబర్ 9: జాతీయ మహిళా పార్లమెంటుకు విచ్చేసే అతిధులకు ఏర్పాట్లు ఘనంగా వుండాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంథం చంద్రుడు మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులను కోరారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇన్‌ఛార్జి కలెక్టర్ గంథం చంద్రుడు జాతీయ మహిళా పార్లమెంటుకు విచ్చేసే అతిధులకు చేపట్టవలసిన ఏర్పాట్లపై మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డిపి ఆప్టే ప్రతినిధులతో చర్చించారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళా ప్రముఖులు, దేశంలోని వివిధ హోదాల్లో వున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కళాశాలలకు చెందిన విద్యార్థినిలు రోజుకు 12వేల మంది సదస్సుకు హాజరుకానున్నారన్నారు. సదస్సుకు విచ్చేసే అతిధులకు ఆతిధ్యం అద్భుతంగా వుండేలా ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ సలోని సదాన పాల్గొన్నారు.