విజయవాడ

బ్యాంకులకు సెలవులతో సామాన్యులు సతమతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, డిసెంబరు 10: పెద్దనోట్ల రద్దు, అవసరానికి తగ్గట్లు కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, పాత వంద నోట్లు తగినన్ని లేకపోవడం.. కలగలిసి సామాన్యుడికి నరకం చూపిస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి పాల ప్యాకెట్‌తో మొదలుకుని రాత్రి నిద్రించడానికి ముందు మస్కిటోకాయిల్ వరకు ప్రతిదీ రూపాయితో ముడిపడి ఉండటంతో అవసరానికి అనుగుణంగా నగదు సమకూరకపోవడంతో సామాన్యులు సతమతవౌతున్నారు. తమ డబ్బును బ్యాంక్ నుండి తీసుకోవాలన్నా గంటల తరబడి క్యూలైన్లలో కష్టాలు పడాల్సిరావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికితోడు నెలరోజుల నుండి నగదు మార్పిడి ప్రక్రియ ఏకధాటిగా కొనసాగుతున్న క్రమంలో బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఇప్పుడు ఖాతాదారుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు చందంగా మారింది. వరుసగా శని, ఆది, సోమవారాలు బ్యాంకులకు సెలవు కావడంతో శుక్రవారం నాడే పెద్దసంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఏటిఎంల ముందు క్యూలు కట్టారు. శనివారం కూడా నగరంలో ఏటిఎంల దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు అవస్థలుపడ్డారు. ఏటిఎంలలో కేవలం రూ.2వేల వరకు మాత్రమే నగదు సమకూరడంతో దాని కోసం గంటల తరబడి ఎదురుచూశారు. కొందరి చేతికి నగదు అందినప్పటికీ ఏటిఎంలలో నగదు ఖాళీ కావడంతో ఎంతోమంది క్యూలలో నిల్చున్న తర్వాత కూడా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదేం కర్మరా బాబూ!.. అనుకుంటూ తమ దుస్థితిని తామే తిట్టుకుంటూ చిరాగ్గా వెనుదిరిగారు. నగరంలో రెండొందలకు పైగా బ్యాంకులు ఉన్నాయి. అందుకు రెట్టింపే ఏటిఎం సెంటర్లు ఉన్నప్పటికీ చాలావరకు వాటిదగ్గర ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బయటి మార్కెట్‌లో కనీసం వడ్డీలకు సైతం ఎవరూ డబ్బులు తిప్పకపోవడం, బంగారం తనఖా దుకాణాల్లో నగలు తనఖా పెట్టుకోకపోవడంతో సామాన్యులు తలలు పట్టుకోవాల్సిన స్థితి నెలకొంది. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా ఇప్పటికే కరెన్సీ కష్టాల్ని అనుభవిస్తున్న వారిపై బ్యాంకులకు వరుస సెలవులు మరింత తీవ్ర ప్రభావం చూపాయి.

నేడు ప్రత్యేకంగా ఓటర్ల నమోదు

విజయవాడ, డిసెంబర్ 10: 2017 జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన యు వత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 11న ఆదివారం జిల్లాలో ని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు, అన్ని మండల కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల అధికారులు కొత్తగా ఓటర్ల నమోదుకు అవసరమైన ఫామ్-6 ఫారాలతో పాటు ఓటర్ల లిస్టు లో తప్పొప్పుల సవరణ, తొలగింపునకు అవసరమైన ఫాం 7, 8, 8ఎ ఫారా లు అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మ ధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని పో లింగ్ కేంద్రాలు, మండల రెవెన్యూ కా ర్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.