విజయవాడ

ఆర్టీసీ సిసిఎస్ ఎన్నికల్లో ‘ఎంప్లాయాస్’ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: ఎసిఎస్ ఆర్టీసీలో అత్యంత ప్రతిష్ఠాకరమైన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ‘సిసిఎస్’కి శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎంప్లారుూస్ ఎన్నికల కూటమి విజయదుందుభి మోగించింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మూలధనంగా ఉన్న ఈ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో 12 జిల్లాల్లో ఎంప్లారుూస్ యూనియన్ కూటమికి తిరుగులేని ఆధిక్యత లభించింది. ఒకే ఒక జిల్లాలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు ఆధిక్యత లభించింది. 236 స్థానాలకు గాను ఎంప్లారుూస్ యూనియన్ తరఫున 146 మంది అభ్యర్థులు గెలవగా, ఎన్‌ఎంయు తరఫున 90 మంది గెలుపొందారు. రాజధాని కృష్ణా జిల్లాలో ఇయు తరఫున 17 మంది, ఎన్‌ఎంయు తరఫున 8 మంది గెలుపొందారు. ఆర్టీసీ ఎండి మాలకొండయ్య ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయి. కొద్ది మాసాల క్రితమే జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎన్‌ఎంయు అతి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందినప్పటికీ 11 జిల్లాల్లో గుర్తింపు పొందింది. అయితే ఈ దఫా ఎంప్లారుూస్ యూనియన్ కక్షగట్టి ఇతర సంఘాలని ఏకం చేసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఈ అసాధారణ విజయం సాధ్యమయింది. ఎన్నికైన ప్రతినిథులు పాలకవర్గ డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది.

నోట్ల రద్దుపై మోదీ తుగ్లక్ చర్యలు నిరసిస్తూ
22న బ్యాంకుల ఎదుట సిపిఐ సత్యాగ్రహం
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి

విజయవాడ, డిసెంబర్ 16: నోట్ల రద్దుతో అన్ని వర్గాల సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఇక్కట్లపాలు చేసి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కల్పించిన ప్రధాని మోదీ తుగ్లక్ చర్యలను నిరసిస్తూ ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లీడ్ బ్యాంకుల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో సత్యాగ్రహం ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలియజేశారు. బ్యాంకుల, ఏటిఏంల వద్ద క్యూలలో నిలబడి వృద్ధులు ప్రాణాలు కోల్పోతుంటే ఏమీ తెలియనట్టు మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు సాదాసీదాగా మాట్లాడుతూ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు స్పందించినా మోదీలో చలనం లేదన్నారు. హనుమాన్‌పేటలోని సిపిఐ కార్యాలయం దాసరి భవన్‌లో శుక్రవారం రామకృష్ణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, పి.హరినాథరెడ్డి పాల్గొని సత్యాగ్రహానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులే కాకుండా బ్యాంకు ఉద్యోగులు కూడా వత్తిడిని తట్టుకోలేక మరణించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇంతటి తీవ్ర సంక్షోభం పట్ల మోదీకి, చంద్రబాబుకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, మరోపక్క రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ ఇచ్చేశాం, చట్టబద్ధత అవసరం లేదని కేంద్ర ప్రణాళికాశాఖ మంత్రి చెబుతున్నారని, ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావడం లేదన్నారు. మళ్లీ టిడిపి, బిజెపి డ్రామాలు ఆడడం మొదలు పెట్టాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ పూడ్చాల్సి ఉండగా రూ.3,941 కోట్లు మాత్రమే ఇప్పటికి వచ్చాయని, విద్య, వైద్యానికి రూ.9వేల కోట్లు కేటాయించి, ఇప్పటికి రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అన్నీ ఇచ్చేశామని కేంద్రమంత్రి చెబుతుంటే చంద్రబాబు, వారి పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి ప్రణాళికాబద్ద ఏర్పాట్లు
ప్రదర్శనకు రానున్న గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు
జిల్లా కలెక్టర్ బాబు.ఎ
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 16: నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23, 24, 25వ తేదీల్లో జరుగనున్న అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కనున్న నేపథ్యంలో ప్రదర్శన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరుదైన రీతిలో జరిగే ఈసమ్మేళనంలో హాజరైయేందుకు గాను 18 దేశాల నుంచి 7వేల మంది పైగా కళాకారులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారని తెలిపారు. మొదటి రెండు రోజుల్లో కూచిపూడి సాంప్రదాయ కళాకారులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నర్తకీ, నర్తకులు, వర్ధమాన కళాకారులు, ప్రత్యేక నాట్య ప్రదర్శనలతో కనువిందుచేయనున్నారన్నారు. చివరి రోజైన మూడవ రోజు డిసెంబర్ 25న సుమారు 6వేల మంది కళాకారులతో అపూర్వమైన రీతిలో మహాబృంద నాట్ట ప్రదర్శన జరుగుతుందన్నారు. కూచిపూడి నాట్యానికి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ణయం ప్రకటించేందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు కూడా రానున్నారని కలెక్టర్ బాబు తెలిపారు. కూచిపూడి నాట్యకళకు పుట్టినిల్లుగా ఉన్న కృష్ణాజిల్లాలో ఇటువంటి నాట్య సమ్మేళనం జరగడం ప్రతిష్టాత్మకం కాబట్టి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అలాగే నాట్య ప్రదర్శనకు తరలివచ్చే ప్రేక్షకులకు అవసరమైన వౌళిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి వాటిని విజయవాడ నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటుచేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ ను, ప్రదర్శన రోజుల్లో నగరంలో ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ డిసిపి క్రాంతిరాణ లను కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సిలికానాంధ్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.