విజయవాడ

విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 20: జై దుర్గా భవానీకి జై అంటూ శిరస్సుపై ఇరుముడులు ధరించిన భవానీ దీక్షాధారులు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళవారం ఉదయం అమ్మవారి సన్నిధిలో ఇరుముడులను సమర్పించి దీక్షల విరమణ చేశారు. 45 రోజులుపాటు అత్యంత నియమనిష్ఠలతో భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాధారులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి నగరానికి చేరుకొని ఈ దీక్షల విరమణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్లిఖార్జున మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమగుండం వద్ద శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం స్ధానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు నియమనిష్ఠలతో అగ్ని ప్రతిష్ఠాపన చేసి దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి దంపతులచేత ప్రత్యేక పూజలు చేయించి తర్వాత ఈ అగ్నిని మిగతా హోమగుండాలో వేయించటతో అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం మొదలైంది. రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాలనుండి వచ్చిన దీక్షాధారులు తొలుత నగరానికి చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించారు. గురుభవానీల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, ఇరుముడులకు సైతం పూజలు నిర్వహించుకొని జై దుర్గా భవానీ జై అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ భవానీలు బృందాలు బృందాలుగా గురుభవానీల ఆధ్వర్యంలో వినాయకుడి గుడి నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కొంతమంది భవానీలు వారి మొక్కుబడులకు అనుగుణంగా 3, 6, 9, సార్లు చొప్పున గిరిప్రదక్షణ చేసి తిరిగి వినాయకుడు వద్దకు చేరుకున్నారు. సుమారు 5 కిలోమీటర్ల దూరాన్ని క్యూమార్గంలో నడిచి కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత కొంతమంది మల్లిఖార్జున మహామండపం, మరికొంతమంది భవానీలు మల్లిఖార్జున స్వామివారి మెట్ల మార్గం గుండా మల్లిఖార్జున పేట సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ హోమగుండాన్ని దర్శించుకొని ఇరుముడులను సమర్పించుకొని అక్కడే ఉన్న గురుభవానీల ఆధ్వర్యంలో మాలలు తీయించుకొని అర్జున వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రంలో అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. తలానీలలు మొక్కుబడులు ఉన్న భవానీలు విజయవాడ నగరపాలక సంస్ధ ఎదుట ఏర్పాటు చేసిన దేవస్థానం కేశఖండనశాలలో తలానీలాలు సమర్పించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ ఐదు రోజులపాటు వేకువ జామున 3 గంటలనుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోనే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసారు. అమ్మవారిని దర్శించుకోనే భవానీలు, భక్తులు విధిగా కెనాల్‌రోడ్‌లోని వినాయకుడి వద్ద నుండి ప్రారంభం కానున్న క్యూమార్గం గుండా కొండపైకి చేరుకోవాలి. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రి మొత్తం రంగురంగుల విద్యుత్ లైటింగ్‌ను ఏర్పాటు చేయటంతో రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి ధగధగ కాంతులతో మెరిసిపోతోంది. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఐదురోజులు పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది. దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ భవానీలకు సేవలు అందించారు.
నగర పాలకులకు పరాభవం
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 20: విఎంసి ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ.32కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన జి ప్లస్ 8 అంతస్థుల నూతన భవన నిర్మాణ పనులు ఇక శాశ్వతంగా నిలచిపోయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నిలచిపోయిన ఈ భవన నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ తన యంత్ర సామాగ్రితోపాటు ఇతర నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతించలేదన్న విషయం స్పష్టమవుతోంది. మంగళవారం తరలింపు చర్యలను చకచకా చేపడుతున్న వైనాన్ని చూసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు నగర పాలకుల వైఫల్యాలను నిరసిస్తున్నారు. గత సంవత్సర కాలంగా జరుపుతున్న ఈప్రక్రియలో ఇంతవరకు ప్రభుత్వ అనుమతులు కానీ, నిధులు కానీ మంజూరు కాకముందే కమిషనర్ వీరపాండియన్ టెండర్ ప్రక్రియ నిర్వహించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఘోరంగా వైఫల్యం చెందారన్న వాదనలు వినిపిస్తుండగా ప్రజాప్రతినిధిగా పాలన సాగిస్తున్న మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబును ఒప్పించడంలో సఫలీకృతం కాకపోవడం ప్రస్థుత పరిస్థితి నెలకొనగా ఎపి టూరిజం చేపడుతున్న రివర్ ఫ్రంట్ వ్యూ పథకానికి విఎంసి ప్రధాన కార్యాలయ ఆవరణ కూడా అప్పగించేసి నగరంలోని ఇతర ప్రాంతానికి తరలిస్తారన్న విషయం అవగతమవుతోంది. ఇందుకు నిలిచిన పనులే నిదర్శనంగా నిలుస్తుండగా కేవలం కౌన్సిల్ అమోదం తప్ప అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించిన వైనంతో ఇప్పటికీ రూ.2 కోట్ల మేర ఖర్చయినట్టు అధికారిక లెక్కలే చెబుతుండగా ఈ ఖర్చులో కాంట్రాక్టర్‌కు ఎంతెంత, ఏ ఖాతాలో నుంచి చెల్లింపులు జరిగాయన్న విషయం పక్కన పెడితే అర్థంతరంగా నిలిచిన పనుల కారణంగా పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్ తాను నష్టపోయినందుకు రూ.10కోట్ల మేర పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా విఎంసిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎలాగైనా అనుమతులు తీసుకొస్తాం, పనులు చేసేయండని ప్రగల్భాలు పలికిన అధికారులు ఈ గండం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలోనని తలలు పట్టుకుకూర్చున్నారు. నూతన భవన నిర్మాణ పనుల నిలిచిన విషయంలో విఎంసి అధికార టిడిపి పాలకులకు తలదించుకోక తప్పలేదు. టిడిపి పాలకులు అనాలోచిత చర్యలపై విపక్షాలు ఇప్పటికే భగ్గుమంటుండగా ఈ విషయంపై విపక్షాల దాడిని ఏ విధంగా ఎదుర్కొనాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది. నూతన భవన నిర్మాణంలో కేవలం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తప్ప మిగిలిన ప్రజాప్రతినిధులెవ్వరూ అంతగా పట్టించుకోనందుకే నూతన భవనానికి అనుమతులు రాలేదన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో నగర మేయర్ శ్రీ్ధర్ విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఎదురైయ్యే విమర్శలను ఏ విధంగా ఎదుర్కొంటారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా ఈ భవన నిర్మాణంపై సోమవారం ఆంధ్రభూమి సిటీ ఎడిషన్‌లో ‘ఇప్పుడేం చేయాలి చెప్మా’ అనే వార్తా శీర్షిక ప్రచురితమైన విషయం తెలిసిందే.