విజయవాడ

జిఎస్టీ పోర్టల్‌కు అనుసంధానమవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ క్రైం, డిసెంబర్ 22: సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, విభాగాల క్రింద రిజిస్టరైన పన్ను చెల్లింపుదారులు తమ గుర్తింపును నూతన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) యొక్క జిఎస్‌టి పోర్టల్ నందు జనవరి 1 నుండి 15 మధ్య జిఎస్‌టి ఇన్ పోర్టల్ నందు జనవరి 1 నుండి 30 వరకు అనుసంధానం చేసుకుని జిఎస్‌టి చట్టం క్రింద కొత్త చెల్లింపు విధానానికి సమాయత్తం కావాలని తొమ్మిది జిల్లాల సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖలో 2016, డిసెంబర్ వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పన్ను చెల్లింపుదారుల వివరాలకు సంబంధించి తాత్కాలిక నమోదులు, పాన్ నెంబర్ ఆధారిత నమోదు కాకపోవటం, ఫోన్ నెం, ఈ - మెయిల్ వంటి సమాచారం అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటికి సంబంధించి గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఎక్సైజ్ కమిషనర్‌ల పరిధిలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాలోని ఎక్సైజ్, సేవా పన్ను కార్యాలయాల్లో పన్ను చెల్లింపుదారులు తగిన సమాచారంతో తమకు సంబంధించిన వివరాలను సరిగా నమోదు చేసుకుని నిర్ణీత గడువులోగా జిఎస్‌టి విధానానికి సులువుగా అనుసంధానం కావలసిందిగా ఆయన కోరారు. పోర్టల్‌తో అనుసంధానించుకోవటం అనివార్యమన్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను చెల్లింపుదారుల గుర్తింపు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పూర్తిగా రద్దు చేయబడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాట్ రిజిస్ట్రేషన్ ఉన్న కేంద్ర ఎక్సైజ్, సేవాపన్ను చెల్లింపుదారులు సంబంధిత వాణిజ్య పన్నుల కార్యాలయాల ద్వారా జిఎస్‌టి పోర్టల్ నందు తమ సంపూర్ణ వివరాలు నమోదు చేసుకుని కొత్త జిఎస్‌టి గుర్తింపు సంఖ్య పొందుటకు అవసరమైన ఐడి, పాస్‌వర్డ్‌ను జనవరి 1 నుండి 15 వరకు గల మధ్యకాలంలో పొందవలసినదిగా కోరారు. అలాగే వ్యాట్ రిజిస్ట్రేషన్ లేని ఎక్సైజ్, సేవా పన్ను చెల్లింపుదారులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) బోర్డు నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి ఉండాలని చెప్పారు.

వేదవతి ప్రాజెక్టుకు నిధులివ్వండి:సిపిఐ

విజయవాడ, డిసెంబర్ 22: కర్నూలు జిల్లాలో అత్యంత కరవు ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలోని వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గురువారం కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వేదవతి ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బాగా వెనుకబడిన కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న ‘వేదవతి’ నది నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 50వేల ఎకరాలకు నీరందించడానికి వీలవుతుందన్నారు. అలాగే మంచినీటికి కటకటలాడుతున్న పలు గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చడానికి అవకాశముంటుందన్నారు.