విజయవాడ

క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి సర్కారు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ సంస్థ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాధరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. ఉన్నత, ఉదాత్త, గొప్ప మనస్సున్న మహాదేవుడు ఏసుక్రీస్తు అన్నారు. వారు ఉద్బోదించిన బోధనలు మనమందరం ఆచరించి సమాజంలో ఆదర్శంగా నిలువాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. సేవాగుణానికి ప్రతీకైన మదర్ థెరిస్సా సమాజానికి చేసిన సేవలను మంత్రి స్మరించారు. ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ బాటలోని క్రిస్టియన్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యకు 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. పేద క్రిస్టియన్‌లకు వివాహానికి 50వేల రూపాయల సహాయాన్ని అందిస్తున్నామన్నారు. పవిత్ర జెరూసలెం యాత్రకు 40వేల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మైనార్టీల ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. సమాజంలో రుగ్మతలు పోవాలంటే బైబిల్ సూక్తులు ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్ల పనితీరును ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పరిశీలన చేస్తున్నారని అటువంటిచోట్ల డ్రాఫవుట్స్ ఉండటం శోచనీయమన్నారు. గ్రామాల్లో వున్న డ్రాఫవుట్స్‌ను రెసిడెన్షియల్ స్కూలులో చదివించడం ద్వారా నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భవిష్యత్తును కల్పించినవారమవుతామని మంత్రి ఈ సందర్భంగా క్రిస్టియన్ మత పెద్దలకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో తొలుత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాండిల్ లైటింగ్, అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి క్రైస్తవ సోదరులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నామినేటెడ్ ఎంఎల్‌ఎ పిలిఫ్ సి థాచ్చర్, ఎపిఎస్ సిఎం ఎఫ్‌సి ఎండి పి.ఉషాకుమారి, ఇడి విజయకుమార్, డిఎండబ్ల్యూఓ గౌసియాబేగం, క్రిస్టియన్ మత పెద్దలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

కృష్ణా వర్సిటీ హ్యాండ్‌బాల్ మహిళా జట్టు ఎంపిక
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 23: కెబిఎన్ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.నారాయణరావు తెలిపారు. ఎంపికైన జట్టు పెరియార్ విశ్వవిద్యాలయంలో 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయాల హ్యాండ్‌బాల్ మహిళల టోర్నమెంట్‌లో పాల్గొంటుందని పేర్కొన్నారు. ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు ఇలా వున్నాయి. ఇ.కల్యాణి (డా.ఎంఆర్‌ఎఆర్ పిజి సెంటర్), టి.నవ్యసుమ, ఎన్.మనీషా (ఆంధ్ర లయోలా కళాశాల), ఎస్.గౌరీపార్వతి, పి.శివనాగలక్ష్మి, జి.సాయిలక్ష్మి (కెబిఎన్ కళాశాల), డి.తారాబాయి, ఎస్.దివ్యవల్లి (శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల), సుష్మ స్వరాజ్ (ఆంధ్ర లయోలా కళాశాల), ఎం.కోటేశ్వరి (విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), పి.అశ్విని (ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల). ఈ జట్టుకు మేనేజర్‌గా డా.ఎం.సాంబశివరావు వ్యవహరిస్తారు.