విజయవాడ

తక్కువ ఖర్చుతో అధిక విద్యుత్ సాధనకు కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 31: థర్మ ల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్‌గా పద్మ సుజాత శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పరిపాలన భవనం సమావేశ మందిరంలో శనివారం జరిగిన కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చు తో అధిక విద్యుత్ ఉత్పాదన సాధించేందుకు తనవంతు కృషి చేయగలనని తెలిపారు. పేద వారికి సహాయం చేయటం, పట్టుదలతో సంస్థ అభివృద్ధిలో తనవంతు కృషి చేయగలనని దీనికి ఉద్యోగ కార్మిక సంఘాలు, కార్మికులు సహకరించాలని కోరారు. ఏలక్ట్రికల్ ఇంజనీర్‌గా పూర్తి చేసిన సహాయ ఇంజనీర్, ఎడిఇ, విద్యుత్ సౌధాలో డిఇగా ఎస్‌ఇగా సమర్థవంతంగా ఈ కేంద్రంలో పని చేసి శిక్షణ కేంద్రంలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేసి ఆధునిక టెక్నాలజీతో విద్యుత్ ఉత్పాదన సాధించేందుకు శిక్షణ ఇవ్వటంలో సమర్థవంతంగా పని చేశానని పేర్కొన్నారు. ప్లానింగ్, కమర్షియల్, వాణిజ్య కార్యక్రమాల్లో పని చేయగా 26ఏళ్ల అనుభవంతో సమర్థవంతంగా పని చేశానని వివరించారు. డా.ఎన్‌టిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్‌గా ఓ మహిళ ప్రప్రథమంగా బాధ్యతలు చేపట్టటం జరిగిందని ఆమె వివరించారు.

జన్మభూమి గ్రామ సభలను విజయవంతం చేయాలి
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 31: రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2 నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జన్మభూమి- మన ఊరు గ్రామ సభలను విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శనివారం జన్మభూమి నోడల్ అధికారుల తో నిర్వహించిన సమీక్షా సమావేశం లో వీరపాండియన్ మాట్లాడుతూ సభలకు ప్రజలు విరివిగా పాల్గొనే డివజన్ పరిసర ప్రాంతాల్లో మైక్ ప్రచారం నిర్వహించాలన్నారు. జన్మభూమి సభల విధులు నిర్వర్తించే అధికార, సిబ్బంది ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిచూసుకోవాలని,ఏరోజుకారోజు జరిగిన సభల వివరాలు, ప్రజల దరఖాస్తులను కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు. గత జన్మభూమి దరఖాస్తులు, పరిష్కారాలపై పూర్తి వివరాలను దగ్గరుంచుకోవాలన్నారు. ప్రజాసాధికార సర్వే, యుజిడి దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్చత యాప్‌ల డౌన్ లోడ్ ప్రక్రియలను ప్రతి జన్మభూమి సభలలో చేపట్టాలన్నారు. ఈసమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.