విజయవాడ

భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 1: ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీ దుర్గమ్మను దర్శించుకోవటానికి నూతన సంవత్సరం రోజైన ఆదివారం ఉదయం నుండే భక్తులతోపాటు, ఐపియస్, ఐఎయస్, న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఆదివారం నాడే న్యూ ఇయర్ రావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దుర్గగుడి అధికారులు సైతం ఊహించని రీతిలో భక్తులు రావటంతో దుర్గగుడి అధికారులు పరిస్థితిని గమనించి ఘాట్‌రోడ్ ఓం టర్నింగ్ ముందు భాగంలోనే బ్యారికేడ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులను దేవస్థానం సమాచార కేంద్రం వద్ద వరకు అనుమతించకుండా అక్కడే నియంత్రిస్తూ భక్తులు అక్కడే నుండి వివిధ క్యూమార్గాల్లోకి పంపారు. దీనికితోడు భక్తుల రద్ధీ విపరీతంగా ఉండటంతో రూ.300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు ఆదివారం ఉదయం దర్శనం చేసుకోవటానికి 4గంటలు, రూ.100 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు 5గంటల సమయం, సర్వదర్శనం చేసుకోవటానికి మూడు గంటల సమయం పట్టింది. వేకువ జామున 5గంటల నుండి ఉదయం 7గంటల వరకు ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. ఉదయం 8గంటల నుండి క్రమంగా భక్తుల రద్ధీ పెరగటంతోపాటు, ఇదే విధంగా ఐపియస్‌లు, ఐఎయస్‌లు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ఈవిధంగా అటు భక్తులు, ఇటు విఐపిలు ఒకేసారి రావటంతో ఆలయంలో విపరీతమైన రద్ధీ ఏర్పడింది. సర్వదర్శనం చేసుకోవటానికి భక్తులకు సుమారు 3గంటల సమయం పట్టింది. వచ్చిన భక్తుల్లో అధిక సంఖ్యలో సర్వదర్శనం చేసుకోవటానికే అసక్తి చూపించారు. దుర్గగుడి అధికారులు సైతం భక్తులను ఎప్పటికప్పడు నియంత్రిస్తూ అమ్మవారిని దర్శించుకోనే విధంగా చర్యలు చేపట్టారు. మల్లిఖార్జున మహామండపం నుండి క్యూమార్గం గుండా కొండపైకి చేరుకున్న సర్వదర్శనం భక్తులు కొంత మేరకు ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్ధీ అధికంగా ఉండటంతో దుర్గగుడి అధికారులు వారిని రాజగోపురం పక్క నుండి తిరిగి ఘాట్‌రోడ్ వైపు ఉన్న క్యూమార్గంలోనికి పంపారు. ఈమార్గం గుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టింది. భక్తులు సైతం ఎంతో ఓపికగా క్యూమార్గంలో ఉండి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

సమాజ శ్రేయస్సుకు దోహదపడేలా ఉద్యోగుల సేవలు ఉండాలి
* నూతన సంవత్సర వేడుకల్లో ఎన్‌జివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు

విజయవాడ, జనవరి 1: సమాజ శ్రేయస్సుకు దోహదపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించినప్పుడే ప్రజల నుండి గుర్తింపు లభిస్తుందని అప్పుడే మానసిక ఆనందాన్ని పొందగలుగుతామని ఎపి ఎన్‌జివో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎపిఎన్‌జివో అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎన్‌జివో హోం నందు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. వందలాది మంది ఉద్యోగుల సమక్షంలో నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసిన అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన పాత్ర అన్నారు. ప్రతి ఉద్యోగి సమాజ శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రోత్సహించడం ఉద్యోగులు బాధ్యతగా గుర్తెరిగి ప్రజలకు మార్గదర్శకులు కావాలని అప్పుడే ఆయా రంగాల అభివృద్ధి చెందడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనందించి రాబోయే సంవత్సరంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుదామని నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొడ్డు నాగేశ్వరరావు, ఎపి ఎన్‌జివో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎ.విద్యాసాగర్, ఎండి ఇక్బాల్, నగరశాఖ అధ్యక్షుడు కోనేరు రవి, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వాసు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, పబ్లిక్ సెక్టారు ఉద్యోగుల సంఘం ప్రదాన కార్యదర్శి సాంబశివరావు, పలు ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.