విజయవాడ

ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం సిద్ధమైతే ఫిబ్రవరి నెలాఖరులో శీతాకాల సమావేశాలను నిర్వహిస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ భవన నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారన్నారు. నిర్మాణం పూర్తి అయితే ఫిబ్రవరి నెలాఖరులో సమావేశాలను నిర్వహిస్తామన్నారు. లేకుంటే బడ్జెట్ సమావేశాలతో కలిపి నిర్వహిస్తామన్నారు. శీతాకాల సమావేశాలు నిర్వహించడం సంప్రదాయమని, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదని తెలిపారు. దీంతో చాలా వ్యవధి ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణం, డిజైను ఇప్పటికే ఖరారు చేశారు కనుక, లోపల ఏర్పాట్లను పరశీలించానని తెలిపారు. సిఎం చాంబర్, స్పీకర్ రూం, పోడియం, సభ్యులకు ఏర్పాటు చేసిన కుర్చీలు, కుర్చీలు సౌకర్యవంతంగా ఉన్నాయా? లేదా? అన్న అంశాలను పరిశీలించానని తెలిపారు. పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించి తగు ఆదేశాలు ఇచ్చానన్నారు.

జివో నెం.14 జీవో కాపీలు దగ్ధం
బెంజిసర్కిల్, జనవరి 5: మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల చదువులకు దూరం చేసే జీవో నెం.14ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జివో కాఫీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.నూర్‌మహమ్మద్ మాట్లాడుతూ చైనా విద్య పేరుతో ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య ఉపాధ్యాయులను మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించారు. ఇప్పడు ఇంగ్లీష్ మీడియం పేరుతో వున్న మున్సిపల్ టీచర్స్‌ను తొలగించి ఈ పాఠశాలలను నారాయణ ఆక్రమించుకోవడానికి జరుగుతున్న కుట్రే ఈ జీవో నెం.14 అని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, గర్ల్స్ కన్వీనర్ ఎల్.చిన్నారి, నాయకులు రమణ, పవన్, రాజ, ఓబులేసు, జిల్లా అధ్యక్షుడు టి.ప్రవీణ్‌కుమార్, కోటిబాబు, సోమేశ్వరరావు పాల్గొన్నారు.