విజయవాడ

డిజిటలైజేషన్ భావితరాలకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జనవరి 6: డిజిటల్ సాంకేతికత ఉపాధ్యాయులకు సహాయ సాధనంగా వుండి, వారిలోని లోపాలను పూరించే విధంగా ఉండాలని రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్, విద్యాశాఖ పూర్వ ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్యసమితి విద్యావిభాగంలో పనిచేసిన అధికారి డా.ఐవి సుబ్బారావు సూచించారు. డిజిటల్ విధానాల వల్ల వచ్చే సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా మొత్తం విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 28వ పుస్తక మహోత్సవం సందర్భంగా ఆరోజు శుక్రవారం మేధోమధన వేదిక మీదా, సాహిత్య వేదిక మీదా ‘డిజిటల్ యుగంలో విద్యాబోధన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై నిర్వహించిన గోష్టిలో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. జమనాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత, విద్యావేత్త నన్నపనేని మంగాదేవి మాట్లాడుతూ డిజిటల్ సాధనాల వల్ల పిల్లల్లో మానవీయ విలువలు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. విద్యావేత్త, బాలల హక్కుల ఉద్యమకారుడు సిఎ ప్రసాద్ మాట్లాడుతూ 5వ తరగతి వరకూ విద్యాబోధన ఆటపాటల ద్వారా నేర్పి ఆ తర్వాత డిజిటల్ పద్ధతులను పరిచయం చేయాలన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు రామబ్రహ్మం మాట్లాడుతూ మన విద్యావ్యవస్థ బ్రిటీష్‌కాలం నుంచి పెద్ద మార్పులకు లోను కాలేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ డైరక్టర్, గిరిజన విద్యావేత్త డా.పద్మ మాట్లాడుతూ డిజిటల్ విద్యాబోధనను సరిగ్గా ఉపయోగించుకుంటే విద్యార్థులు తమ శక్తిసామర్ధ్యాలకు తగిన వేగంతో నేర్చుకోవడానికి వీలుంటుందన్నారు. సదస్సును సమన్వయం చేసిన పరిపాలనా సిబ్బంది శిక్షణా కళాశాల ఆచార్యులు మాట్లాడుతూ చినవీరభద్రుడు, ప్రపంచమంతా వేగంగా మారుతున్నా పాఠశాలలు మారడం లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సివో విష్ణు మాట్లాడుతూ డిజిటల్ సాంకేతికత జ్ఞానం సముపార్జన, బోధన, ప్రసారం చేసే విధానం పూర్తిగా మారిపోబోతుందన్నారు.
నేటి కార్యక్రమాలు
విజయవాడ (కల్చరల్), జనవరి 6: విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో శనివారం సమాలోచన వేదికపై ఉదయం 10 గంటలకు పద విభూషణ అవార్డు గ్రహీత, రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ వైవిరెడ్డి ‘నీ డబ్బుపై అవగాహన’ అన్న అంశంపై ప్రసంగం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఇదే వేదికపై రచయితల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేదికపై వైవిరెడ్డి ప్రసంగం, ప్రజాశక్తి బుక్‌హౌస్ ప్రచురణలు ఎఎస్ నీల్ నాలుగు రచనలను డాక్టర్ సమరం ఆవిష్కరిస్తారు. ప్రపంచ విప్లవాల యుగం, ఎరిక్ హాబ్స్, ప్రతిభా వేదికపై విశాలాంధ్ర ప్రచురణలు బీహార్ టు తీహార్, రక్తాశ్రువులు, సిడ్నిగోర్డన్ టెడ్‌అలెన్ పుస్తకాలు, అమరావతి పబ్లికేషన్స్ ప్రచురణలు నవచేతన ప్రచురణలు ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

హజ్ యాత్రకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
బెంజిసర్కిల్, జనవరి 6: ఏపి స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో 2017 సంవత్సరానికి హజ్ యాత్రకు వెళ్ళే వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎపి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కేవి విజయకుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వయంగా గాని లేదా ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విజయవాడ మరియు జగ్గయ్యపేట ద్వారా చేసుకోవచ్చన్నారు.
కమీషన్ల కోసం హోదాను తాకట్టు పెట్టారు

* వైసిపి నాయకుల ధ్వజం
బెంజిసర్కిల్, జనవరి 6: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను తెదేపా నేతలు లూటి చేస్తున్నారని వైయస్సార్సీపి అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. పోలవరం కమీషన్ కోసం ప్రత్యేక హోదాను అమ్మేసారని ఆరోపించారు. వైకాపా గుర్తుతో గెలిచి తెదేపాలోకి చేరిన అ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని గాంధీనగర్‌లోని వైకాపా కార్యాలయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలసి విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును తామేదో నిర్మిస్తున్నట్లు తెదేపా నేతలు సంకలు కొట్టుకుంటున్నట్లు విమర్శించారు. కాంట్రాక్టర్లకు చంద్రబాబు మధ్య కమీషన్ల కోసం మంత్రి దేవినేని సంధి కుదురుస