విజయవాడ

ఆరోగ్యంపై అవగాహనకే ‘అమరావతి మారథాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి మారథాన్, డిజిధన్ మేళా, విమాన విన్యాసాలు, ఏవియేషన్ సమ్మిట్ కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలపై శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఉమ, జిల్లా కలెక్టర్ బాబు.ఎ విలేఖర్లతో మాట్లాడారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆదివారం ఉదయం నగరంలో జియో అమరావతి మారథాన్ పరుగు నిర్వహిస్తున్నట్లు ఉమ తెలిపారు. మారథాన్‌లో భాగంగా 3, 5, 10, 21 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 21 కిలోమీటర్ల పరుగులో విజేతలకు రోలింగ్ ట్రోఫీ అందజేస్తామని, మిగిలిన అన్ని పరుగుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్స్ అందజేస్తున్నామన్నారు. మారథాన్ పరుగులో యువతదే కీలకపాత్ర అని, విద్యార్థినీ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని మంత్రి ఉమ కోరారు.
నగదు రహితానికి డిజిధన్ మేళా
దేశంలో నల్లధనాన్ని నివారించేందుకు నగదు రహిత లావాదేవీలు దోహదపడతాయని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ బ్యాంకుల సహకారంతో నగరంలో 9న డిజిధన్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమ తెలిపారు. 9న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 75 స్టాల్స్‌తో జాతీయస్థాయి డిజిధన్ మేళాను నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారన్నారు. నగదు రహిత లావాదేవీలపై వినియోగదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించనున్నామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, మత్స్య, రైల్వే, పౌర సరఫరాలు, ఆర్టీసీ, ఆయిల్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిజిధన్ మేళాలో ప్రతిఒక్కరూ పాల్గొని నగదు రహిత లావాదేవీలపై అవగాహన పొందాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 9న 50కి పైగా బ్యాంకులు, సెల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు, మార్కెటింగ్, ఫెర్టిలైజర్స్ కంపెనీలతో పాటు జిల్లాలో నగదు రహిత చెల్లింపులు నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ శాఖల ద్వారా మొత్తం 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారన్నారు. డిజిధన్ మేళాను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారన్నారు. స్టాల్స్ ద్వారా నగదు రహిత చెల్లింపుల యాప్‌లను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయటం, పోస్ మిషన్ల అమ్మకం, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాలు తెరవడం, డెబిట్, క్రెడిట్ కార్డులు పొందటం, బ్యాంకు ఖాతాలకు ఆధార్, మొబైల్ నెంబరు అనుసంధానం వంటి వాటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. 9న గన్నవరం మండలం కొండపావులూరు గ్రామం వద్ద 50 ఎకరాల విస్తర్ణంలో సుమారు 120 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్‌ను 12న పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించటంతో పాటు రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అబ్బురపర్చనున్న విమాన విన్యాసాలు
ఈ నెల 12న నగర ప్రజలను విమాన విన్యాస కార్యక్రమాలు అబ్బురపర్చనున్నాయని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పౌర విమానయాన శాఖ, ఫిక్కీ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పున్నమి, భవానీ ఘాట్లలో విమాన విన్యాస కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 12న సాయంత్రం 4.30 నుండి 4.45 గంటల వరకు ఎయిర్‌షో నిర్వహిస్తారని తెలిపారు. సుమారు 4 లక్షల మంది ప్రజలు విన్యాసాలను తిలకిస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు నిర్ణీత సమయాలకు ముందుగానే పున్నమి, భవానీ ఘాట్లకు చేరుకుని విన్యాసాలను తిలకించి విజయవంతం చేయాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు.

అభిమానం హద్దు దాటితే సహించం
* డిజిపి సాంబశివరావు
విజయవాడ (క్రైం), జనవరి 7: ప్రస్తుతం రాష్ట్రంలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాల విడుదల నేపధ్యంలో అభిమానుల్లో సరికొత్త సందడి నెలకొంది. అయితే అభిమానం హద్దులు దాటరాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించబోమని డిజిపి నండూరి సాంబశివరావు హెచ్చరించారు. ఈమేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదల కానుంది. అదేవిధంగా ఒకటి, రెండు రోజుల తేడాతో రాజ్యసభ సభ్యుడు, మెగస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో పెద్ద హీరోల అభిమానుల్లో ఆనందం హద్దులు దాటే అవకాశం ఉన్నట్లు పోలీసుశాఖ గుర్తించింది. దీంతో డిజిపి నండూరి శనివారం 13 జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు సమాచారం. రెండు చిత్రాల విడుదల సందర్భాన్నీ సీరియస్‌గా తీసుకోవాలని, ఎప్పకప్పుడు పరిస్ధితి సమీక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అభిమానులు తమ అభిమాన హీరోని ఆరాధించడంలో తప్పు లేదుగాని, వేరే హీరోని కించపరిచే విధంగా వ్యవహరించరాదని, పొరుగు హీరోకి సంబంధించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లు చించడం వంటి కార్యకలాపాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరి అభిమాన హీరోని వారు గౌరవించుకుంటూనే శాంతియుతంగా వ్యవహరించాలని, అదేవిధంగా ఒకే కాంప్లెక్స్‌లో ఉన్న ధియేటర్లలో గౌతమిపుత్ర, ఖైదీ నెంబర్ 150 రెండు చిత్రాలు పక్క పక్కనే ప్రదర్శించే చోట్ల భద్రత మరింత పటిష్టంగా ఏర్పాటు చేసి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అభిమాన సంఘాలు, అభిమానులు సంయమనం పాటించాలని, ఇతర హీరోల చిత్రానికి సంబంధించి హద్దులు దాటి ప్రవర్తిస్తే తాట తీస్తామంటూ డిజిపి సీరియస్‌గా సంకేతాలు ఇచ్చారు.