విజయవాడ

అంతటా అదే జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 8: రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నారని, అందుకోసం జియో అమరావతి మారథాన్ లాంటి కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతి నగరానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయటానికి అనునిత్యం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఆదివారం ఉదయం 6గంటల నుంచే అత్యంత వైభవంగా జియో అమరావతి మారథాన్ ప్రారంభమవటం సంతోషంగా వుందన్నారు. జియో అమరావతి మారథాన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉండటానికి, లక్ష్యాల సాధనలో యువతకు స్ఫూర్తిగా ఇది నిలుస్తుండటంలో సందేహం లేదని అన్నారు. అమరావతి ఖ్యాతి ఇప్పటికే నలుదిశలా వ్యాపించిందని, ఇక నుంచి ఒక బ్రాండ్‌గా మారబోతోందని, దానికి మారథాన్‌లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ హ్యాపీ సండే రాష్ట్రంలోని ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని, అభివృద్ధికి కొలమానంగా ప్రజలకు స్ఫూర్తిగా ఇలాంటి మారథాన్‌లలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే 21కె రన్‌లో పాల్గొని మొదటి ఐదుగురిలో ఉండటం, కలెక్టర్ బాబు.ఎ 3కె రన్‌లో, సబ్ కలెక్టర్ 5కె రన్‌లో, జిల్లాస్థాయి అధికారులూ పాల్గొనటం గర్వించదగ్గ విషయమని మంత్రి వారిని అభినందించారు. పరుగులో విదేశీయులకు, ఇతర ప్రాంతాల వ్యక్తులకు దీటుగా ఈప్రాంత యువత పాల్గొనడం సంతోషంగా వుందని ఉమ వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో పాల్గొన్న యువతీ యువకుల ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా వుందన్నారు. భవిష్యత్తులో అమరావతి మారథాన్ రన్ రాష్ట్ర రాజధాని ప్రతిష్ఠ ఇనుమడించేలా అంతర్జాతీయ రన్స్‌కు దీటుగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్ర అభివృద్ధిలో కూడా చూపాల్సిన ఆవశ్యకత యువతపై వుందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రెండున్నర ఏళ్లనాడు రాజధాని అమరావతి ఒక కల అని, అది నేడు సాకారం అవుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో యువత భవిష్యత్‌కు అవకాశాలు కల్పించే రాజధానిగా ఏర్పడనుందని తెలిపారు. విజయవాడని ఒక ప్రముఖ నగరంగా చేయటానికి ముఖ్యమంత్రి చేసే కృషికి అందరూ మద్దతు పలకటం మంచి పరిణామమన్నారు. పోలీసు శాఖ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయటం సంతోషంగా వుందన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ప్రతి వారం హ్యాపీ సండే ఇలాగే ఆనందంగా, సంతోషంగా కొనసాగించాలని, జియో రన్‌లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే వారం పున్నమి ఘాట్‌లో ఎయిర్ షో నిర్వహిస్తున్నామని, దీన్నికూడా నగర ప్రజలు ఎంజాయ్ చేయాలని కోరారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా గడపటానికి వ్యాయామం అవసరమని, ప్రతిఒక్కరూ వ్యాయామం చేయాలని తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సవాంగ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకొన్ని మంచి కార్యక్రమాలకు అందరూ ఇలాగే సహకరించాలని కోరారు. ఎంపి కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రానికి ఒక అద్భుత నగరాన్ని నిర్మించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పరితపిస్తున్నారని తెలిపారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారం అవుతుందన్నారు. ప్రతిఒక్కరూ వారంలో ఐదు రోజులు, రోజుకు ఒక గంట వ్యాయామం చేయాలని, అప్పుడే డాక్టరు అవసరం ఉండదని ఆయనన్నారు. బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. సినిమా హీరోయిన్ మంచు లక్ష్మి మాట్లాడుతూ ఎనర్జీకి ప్రతిబింబం విజయవాడ అని అన్నారు. అనంతరం 21కె విన్నర్స్‌ని, 10కె రన్ విన్నర్స్‌ను మంత్రులు, డిజిపి సాంబశివరావు, కృష్ణా, గుంటూరు కలెక్టర్లు ప్రకటించారు. హాఫ్ మారథాన్ పురుషుల్లో మూడు స్థానాలు వరుసగా బి శ్రీని 1.07.22 కాలం, దీపక్‌కుమార్ 1.07.34 కాలం, కిరణ్ 1.08.11 కాలంలో పూర్తిచేశారు. మహిళల్లో రాహెల్ వార్‌కర్ 1.21.11 సమయం, నేహాసింగ్ 1.22.12 సమయం, ఇజ్రాయెల్ సిలాస్ 1.22.51 సమయంలో పూర్తిచేశారు. 10కె రన్‌లో మొదటి మూడు స్థానాల్లో వరుసగా పురుషులు లక్ష్మణ్ 35.08 నిముషాలు, రాహుల్ యాదవ్ 35.22, ప్రియాంక 47.19, సౌజన్య 49.38 నిముషాల్లో పూర్తిచేశారు. నిర్వాహకులు మొత్తం 100 బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ. 1,25,000, రెండో బహుమతిగా రూ. 85వేలు, మూడో బహుమతిగా రూ.70వేలు నగదు అందజేశారు. ట్రోఫీలను పిబి సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు 650 మంది కంటే ఎక్కువగా పాల్గొని గెలుచుకున్నారు. పాఠశాల స్థాయిలో నారాయణ విద్యార్థులు ట్రోఫీని గెలుచుకున్నారు. గత ఏడాది 6వేల మంది కాగా, ఈసారి 10వేల మందికి పైగా మారథాన్ రన్‌లో పాల్గొన్నారు. నగరంలోని 130 కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. నగర పౌరులు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. మేయర్ శ్రీ్ధర్, సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, సబ్ కలెక్టర్ సలోని సిదానా, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి, ప్రకృతికి మధ్య
వైరుధ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది
* పరిష్కారాలు స్థానికమైనవే
* సమాలోచన వేదికపై రాజేంద్ర సింగ్
విజయవాడ (కల్చరల్), జనవరి 8: అభివృద్ధికీ ప్రకృతికి మధ్య ఉన్న వైరుధ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అయినా, దానికి పరిష్కారాలు స్థానికమైనవేనని స్టాక్‌హోం వాటర్ పురస్కార గ్రహీత, రామన్ మెగసెసె పురస్కార గ్రహీత రాజేంద్ర సింగ్ అన్నారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో భాగంగా ఎనిమిదో రోజు సమాలోచన వేదికపై ‘నీరు-అభివృద్ధి’ అనే అంశంపై మేధోమధన సదస్సు నిర్వహించారు. ఆయన ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ 70ఏళ్లలో దేశంలో సొంత నీటివనరులు లేని గ్రామాల సంఖ్య 232 నుంచి 2 లక్షల 75 వేల గ్రామాలకు పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రంలో నీటి సమస్య లభ్యత సమస్య కాదని, సద్వినియోగ సమస్యేనన్నారు. రాష్ట్ర నేతల కళ్లల్లో ఆర్థ్రత నశించిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో నీటి సాక్షరతా ఉద్యమం నిర్వహించడం ద్వారా ప్రజలలోనూ, నేతలలోనూ జల వినియోగం, సంరక్షణలకు సంబంధించి అవగాహన స్పందన పెంచాలన్నారు.
రచయిత, పరిశోధకురాలు ఉమామహేశ్వరి మాట్లాడుతూ గోదావరి అన్నా, కృష్ణ అన్నా కేవలం ప్రవహించే నీటి సమూహాలు కాదనీ, నదులకు ప్రాణం ఉందన్నారు. అందుకే సంప్రదాయంలో నదులను నదీమతల్లులుగా భావించే వారన్నారు. పామరులని మనం భావించే పల్లె ప్రజలకు నదులతో ఉన్న అనుబంధం నాగరికులైన పట్టణవాసులకు లేకపోవడంతో నీటి వినియోగంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నేషనల్ గ్రీన్‌కార్ప్ పూర్వ అధిపతి, పర్యావరణ కార్యకర్త ఉండవల్లి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నీటిని అందరికీ సమానంగా, అవసరానికి తగినంత నీరు అందించగలిగే సమాజమే నిజమైన సమసమాజమన్నారు. సహజత్వానికి, ప్రకృతి సూత్రాలకు విరుద్ధమైన ఆధునిక నీటి నిర్వహణా విధానాల వల్ల మొత్తం దేశంలో నీటి నిర్వహణా వ్యవస్థ, దానికి సంబంధించిన అవగాహన పాడైపోయాయని చెప్పారు.
మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానీటి నిర్వహణా విధానాలను మార్చుకోవాలని సూచించారు.
విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి భాస్కర రమణమూర్తి ప్రకృతిలోని పశుపక్షులను పరిశీలించడం ద్వారా నీటి నిర్వహణకు, సన్నద్ధతకు సంబంధించి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చని సోదాహరణంగా వివరించారు.