విజయవాడ

దేశంలో నిరుపేదల అమ్మ ఇందిరమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 9: దేశంలోని అన్ని వర్గాలనూ సొంత పిల్లలుగా భావించి వారి అభివృద్ధికీ, సంక్షేమానికీ పాటుపడిన నాయకురాలిగా ఇందిరా గాంధీ ‘దేశానికే అమ్మ’ అనిపించుకునేందుకు తగిన నాయకురాలని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అన్నారు. స్వరాజ్య మైదానంలోని మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాహిత్య వేదికపై కొలనుకొండ శివాజీ రాసిన ‘ఎల్లలెరుగని భారత ఖ్యాతి - ఇందిరాగాంధీ’ పుస్తకాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో సంక్షేమాన్ని, అభివృద్ధినీ సమతుల్యం చేసిన ప్రథమ ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, లింగిశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహారావు, తదితరులు ఉపన్యసించారు.
న్యూమరాలజీని
అధ్యయనం చేయాలి
జ్యోతిష్యం, న్యూమరాలజీ, తదితరాల శాస్ర్తియతను కొట్టిపారేయకుండా అధ్యయనం చేయాలని పాత్రికేయులు కొండవీటి మురళి అన్నారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా సోమవారం రాత్రి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేదికపై జెపి పబ్లికేషన్స్ ప్రచురించిన డాక్టర్ రైజల్ చౌదరి రచించిన పవర్ ఆఫ్ న్యూమరాలజీ గ్రంథాన్ని, 2017 సంఖ్యాశాస్త్ర రాశిఫలాల పుస్తకాలను ఆవిష్కరించారు. టివి జర్నలిస్టు కొండవీటి మురళి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడారు. ఏపి సివిల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జెపి పబ్లిషర్స్ అధినేత జక్కంపూడి ప్రసాదరావు, ఎపిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు, ఎపి గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి మణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
బుక్‌స్టాల్స్‌ను పరిశీలించిన కెవిపి
విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పలు స్టాల్స్‌ను సందర్శించారు. సాయి త్రిశక్తి నిలయం వ్యవస్థాపకులు డా.అచ్చిరెడ్డి రచించిన జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర, వాస్తు పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అచ్చిరెడ్డి రచించిన 189 పుస్తకాలను పుస్తక ప్రదర్శనలో వుంచారు. ఇంతటి పుస్తక రచనా యజ్ఞానికి పూనుకున్న డా.అచ్చిరెడ్డిని కొనియాడారు. డా.అచ్చిరెడ్డి రచించిన సంఖ్యాశాస్త్రం, తాంత్రిక మర్మాలు పుస్తకాలను డా.లక్ష్మీసాయిప్రియ కెవిపికి అందజేశారు.
ప్రతిభాశీలి సంజీవనీ కుసుమ్
సామాజిక కోణంలో నవల, వ్యాసాలను రాయగల ప్రతిభ వర్ధమాన రచయిత్రి సంజీవనీ కుసుమ్‌కు ఉందని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ప్రతిభ వేదికపై జర్నలిస్టు ధార గోపి అధ్యక్షతన జరిగిన సభలో సంజీవిని కుసుమ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాసిన సాగర్ సుమన్ ఎట్ కెసిరెడ్డి నవలను మండలి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వున్న రుగ్మతలను అధ్యయనం చేయడంతోపాటు తన అనుభవాలను నవలీకరణ చేయడానికి రచయిత్రికి అభిరుచి ఉండటం అభినందనీయమన్నారు. ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డు సభ్యులు సరోజా మాట్లాడుతూ చిన్న వయస్సులో సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తూ వ్యాసాలు రాయడంతో పాటు నవలను కూడా రాయడం అభినందనీయమని కొనియాడారు. రచయిత చోరగుడి జాన్‌సన్, చినుకు పత్రిక సంపాదకులు నండూరు రాజగోపాల్ మాట్లాడుతూ కెసి రెడ్డి విద్యాలయంలో తన అనుభవాలను నవలగా తీసుకురావడానికి రచయిత చేసిన కృషి అభినందనీయమన్నారు. ఇదే వేదికపై రచయిత డాక్టర్ నక్కా విజయరామరాజు రాసిన దేవతా వస్త్రాలు మూడవ కథా సంపుటిని సిఐడి విభాగం ఎస్పీ కనపర్తి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. డాక్టర్ కోయ కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఆవిష్కరణ సభలో డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు, డాక్టర్ ఆర్ భార్గవి, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, నక్కా మోహన్‌కుమార్ పాల్గొన్నారు.