విజయవాడ

వెకిలి రాజకీయాలు కాంగ్రెస్‌కే చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 11: నోట్ల రద్దు నిర్ణయంతో దేశం శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుందని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని భ్రస్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ నేడు వెకిలి రాజకీయాలకు దిగిందన్నారు. వామపక్షాలు సైతం వారి సిద్ధాంతాలను మరిచి కాంగ్రెస్‌కు వత్తాసు పలకడం తగదన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇఎస్‌ఐ అసుపత్రులకు శంకుస్థాపనలు చేసి త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను కేటాయించనున్నట్లు ప్రకటించారు. గురువారం నగరంలోని మెట్రోపోలిటిన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనకు బిజెపి పాలనకు పోలిక లేదన్నారు. స్వార్ధ రాజకీయాలతో దేశాన్ని దీవాళాతీయించి, భ్రస్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. మోదీ తీసుకున్న సాహసోపేతమైన నోట్ల రద్దును ప్రపంచ దేశాలనే ఆలోచించుకునేలా చేసిందన్నారు. నేటి ఈ నోట్ల రానున్న కాలానికి వరంగా మారుతుందని చెప్పారు. యువతకు ఉపాధి శిక్షణతో పాటు వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారికి చదువుతో పాటు శిక్షణ కూడా ఎంతో అవసరమని గ్రహించి వారి కోసం అప్రంటిస్ యాక్టును తీసుకువచ్చినట్లు తెలిపారు. అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న వారికి ఈపిఎఫ్, ఈఎస్‌ఐను అమలు చేయనున్నట్టు తెలిపారు. మూడు విభాగాలుకు చెందిన అధికారులతో కమిటీని మోదీ వేశారని రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కార్మికుల బోనస్‌ను పది వేల నుండి 21 వేలకు పెంచేందుకు ఇది దోహదపడుతుందన్నారు. మహిళలకు మెటర్నిటి లీవ్‌లను 12 వారాల నుండి 26 వారాలకు పెంచినట్లు తెలిపారు. తిరుపతిలో 50 పడకల అసుపత్రిని నెల రోజుల్లోగా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ, హిందూపూర్‌లో, విజయవాడ రూరల్, విశాఖ ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తే 50 పడకల అసుపత్రులను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని 100 పడకలకు విస్తరిస్తామన్నారు.