విజయవాడ

18న ఎస్‌బిఐ జోనల్ ఆఫీస్ ఘోరవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 15: నోట్ల పాట్లపై ఈనెల 18న సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నగరంలోని ఎస్‌బిఐ జోనల్ ఆఫీస్ వద్ద ఘోరవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నోట్లరద్దు, తదుపరి ఆర్థిక విపత్కర పరిస్థితులను అధిగమించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమంలో భాగంగా 18న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దు విషయంలో కేం ద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్య త ఉందని, తాను రాసిన లేఖతోనే పెద్ద నోట్ల రద్దు చేసినట్టు ప్రకటించుకొన్న సిఎం చంద్రబాబు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చ ర్యల్లో కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన సిఎం చంద్రబాబు రోజుకో మాట, పూటకో వేషం అన్నట్టు ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజానీకంతోపాటు రైతులు, మహిళలు, వ్యాపారులే కాకుండా ఉత్పత్తిదారులైన పారిశ్రామిక వేత్తలు సైతం ఒకపక్క ఇబ్బందులకు గరవుతుంటే మరోపక్క అధికార పార్టీ నేతలు, వారి అనుచరగణం లెక్కకు మించి నూతన నోట్ల మాఫీగా రూపాంతరం చెందారని విమర్శించారు. వందల కోట్ల కొత్త నోట్లు తరలించుకుపోయి నోట్ల కొరతకు కారణంగా నిలిచిన ఘటనలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న తీరు మరింత హేయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తక్షణమే నోట్ల పాట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన ఎస్‌బిఐ జోనల్ ఆఫీస్ ఘోరవ్‌లో ఎపిసిసి అధ్యక్షడు రఘవీరారెడ్డి, ఎంపి కెవిపి రామచంద్రరావు, మండలి లో కాంగ్రెస్ పక్ష నేత సి రామచంద్రయ్యతోపాటు ఎఐసిసి నియమించిన దక్షిత భాతర కో-ఆర్డినేటర్ రామ్మూర్తి తదితరులు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతోపాటు నోట్ల పాట్ల బాధితులు, అభిమానులు విరివిగా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విష్ణు కోరారు.
రంగా విగ్రహం కూల్చివేత హేయం
సింగ్‌నగర్ పైపులరోడ్డు రింగ్ సెంటర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ద్వంసం చేసిన వైనం హేయమని, తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు మల్లాది విష్ణు పేర్కొన్నారు. సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల అభివృద్ధితోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు వంగవీటి రంగా చేసిన సేవలకు గుర్తింపుగా రంగా అభిమానులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సమాజంలో రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టడమేనని, ఇటువంటి పనులు సమర్థనీయం కాదన్న విషయాన్ని విషయాన్ని గుర్తించి అధికార పార్టీ నేతలు తగు రీతిలో స్పందించాలని, ఇటువంటి చర్యలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ ఘటనలో దోషులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రంగా విగ్రహం ధ్వంసం చేసిన చర్యలు రంగా అభిమానులనే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరికీ తీవ్ర ఆందోళన కలిగించాయని, పైపులరోడ్డు సెంటర్‌లో ఆధిపత్యం వహిస్తున్న వారే ఇటువంటి చర్యలకు పురికొల్పినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో అధికారులు ఆ దిశగా సమగ్ర విచారణ జరిపాలని ఆయన పేర్కొన్నారు.