విజయవాడ

సర్వేక్షణ్ ప్రశ్నావళి జవాబులకు రంగుల మాయ ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 16: అవార్డుల కోసం ఆరాటపడుతున్న నగర పాలకులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్న తీరు గమనార్హం కాగా ఈ ప్రచారంలో కూడా తమకు అనుకూలమైన రంగులు ముద్రిస్తూ సర్వే నిబంధనలను పక్కదారి పట్టిస్తు న్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైం ది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ -2017 సర్వే లో పాల్గొనాలంటూ విఎంసి తరఫున కమిషనర్ పేరుతో ముద్రించిన ప్రశ్నావళి పత్రం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రశ్నావళి నగరమంతా చెలామణి అయిన తరుణంలో ఈ పత్రం సర్వేలో భాగంగా ముద్రించిన నిజమైన పత్ర మా లేక మోడల్ ప్రశ్నాపత్రమాన్న వి షయంపై సరైన స్పష్టత లేదు కానీ పరిశీలిస్తే ఇదే అసలైన ప్రశ్నాపత్రంగా కనిపిస్తున్న తరుణంలో ప్రశ్నాపత్రం పైన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జెం డాను మరిపించే విధంగా పసుపు రం గు ఉండగా అడిగిన 6 ప్రశ్నలకు తా ము తెలిపిన జవాబులకే టిక్కులు పె ట్టాలంటూ సరైన జవాబులకు ఆకుప చ్చ రంగు వేయడం గమనార్హం. అంతేకాకుండా ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పారు, వారి వివరాలు తెలిపే అడ్రస్ కాలమ్ ఎక్కడా లేదు. దీనిని బట్టి చూస్తే ఎవరైనా, ఎన్నైనా నింపేయవచ్చు. మళ్లీ క్రాస్ చెకింగ్ చేసే అవకాశమే లేదు. సాధారణంగా అడ్రస్ లేని పత్రానికి విలువ లేదంటారు. కానీ ఈపత్రంపై ఉన్న పసుపు రంగే దీనికి విలువ, ఆధారమన్న విషయం చెప్పకనే చెప్పవచ్చు. ఈవిధంగా దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు ఉన్న విలువ ఏమిటో ఇట్టే చెప్పవచ్చు. ఈ ప్రశ్నాపత్రానే్న ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో ఈ ప్రశ్నాపత్రాన్ని సభికులకు పంపిణీ చేసి పచ్చరంగు జవాబులన్నింటికీ టిక్కు లు కొట్టించేశారు. ఈ విషయం పక్కన పెడితే లెక్కా, పత్రం లేని ప్రశ్నాపత్రాని కి జవాబులు నింపే ప్రక్రియకు కొంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు వినికిడి. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను పరిశీలిస్తే 1వ ప్రశ్న స్వచ్ఛత ర్యాంకింగ్ కొరకు నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ - 2017లో పాల్గొంటున్న విషయం మీ కు తెలియునా ? అనే ప్రశ్నకు ఎ) తెలుసును, బి) తెలియదు అనే జవాబుల లో సర్వేకు అనుకూల జవాబు అయిన ‘తెలుసును’ అనే జవాబునకు ఆకు ప చ్చరంగుతో ముద్రించారు. ఇలా అన్ని ప్రశ్నలకు ‘పచ్చరంగు’ జవాబులు ముద్రించిన వైనం సర్వేపై దాగిన లోపభూయిష్ట చర్యలకు నిదర్శనంగా నిలుస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈప్రశ్నలకు జవాబులన్నీ అధికారులకు, పారిశుద్ధ్య చర్యలకు వ్యతిరేకమనే చెప్పాలి. వేధిస్తున్న సిబ్బంది కొరత, లోపభూయిష్ట చెత్త సేకరణ, తరలింపు, అడ్రస్ లేని డంపింగ్ యార్డు, పూడికలతో నిండిన పక్కా డ్రైయిన్లు, నీటి పారుదల లేని అవుట్ ఫాల్ డ్రై యిన్లు, నిత్యం దోమల దండ యాత్ర, లతో నిరంతరం సతమతమైయ్యే నగర ప్రజలకు ఈప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు. నగరానికి అవార్డు తేవాలన్న తపన వాస్తవ విధుల్లో చూపని అధికారిక చర్యలపై సర్వత్రా నిరసన తెలుపుతుండగా సర్వేక్షణ్ ప్రశ్నల్లో తెలిపిన అంశాలు మాత్రం నగరం ఎక్కడా కనిపించడం లేదన్నది నూటికి నూరు శాతం ప్రజల వాదనగా ఉంది.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డు కోసం కృషి
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 16: దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగరానికి అవార్డు పొందేలా కృషి చేస్తానని ప్రంపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై నగర ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గాను విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన అనంతరం సోమవారం సాయంత్రం మేయర్ ఛాంబర్లో జరిగిన విలేఖర్ల సమావేశంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ అంబాసిడర్‌గా నియమించిన తరుణంలో తనపై మరింత భాధ్యత పెరిగిందన్నారు. చెస్‌లో నగర కీర్తి ప్రతిష్ఠను పెంపొందించిన తాను సర్వేక్షణ్ అవార్డు సాధనలో కూడా కృషి చేస్తానని తెలిపారు. తొలుత నగర మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు సాధనతో నగరానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ఇప్పటికే నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ సర్వేక్షణ్ అవార్డుతో ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలుస్తుందన్నారు. ఈవిషయాన్ని గుర్తించి నగర ప్రజలందరూ సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు, సిఎంహెచ్‌ఓ గోపినాయక్ తదితరులు పాల్గొన్నారు.