విజయవాడ

నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 17: స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశంలోని 500 పట్టణాల్లో ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నగరంలో ప్రారంభమైంది. మంగళవారం నుంచి 3రోజుల పాటు జరుగునున్న ఈ సర్వే జరిపేందుకు భారత ప్రభుత్వ అధికారిక బృందాలు నగరానికి చేరుకొన్నాయి. శ్రావణ్‌కుమార్, సీతారామిరెడ్డి, భరత్ తేజ, ల నేతృత్వంలో వచ్చిన అధికారిక బృందం మంగళవారం ఉదయం విఎంసి కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో వీరపాండియన్ ను కలుసుకొన్న బృందం నగరంలో జరుగుతున్న స్వచ్ఛ్ సర్వేక్షణ్ అంశాలకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. బుధ, గురువారాలలో జరిగే క్షేత్రస్థాయి ప్రాంతాల పరిశీలనతోపాటు సర్వేక్షణ్‌కు చేపట్టిన వివిధ చర్యలపై ఆయా డాక్యుమెంట్లను సైతం అధికారులు పరిశీలించనున్నారు. ఇందులోభాంగా నోటీఫైడ్ కాలనీలతోపాటు మురికివాడలు, మార్కెట్, దేవాలయాల ప్రాంతాలలో కూడా కేంద్ర అధికారులు పరిసరాల స్వచ్ఛతకు చేపడుతున్న చర్యలపై పరిశీలన చేయనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిర్మూలనకై చేపట్టిన చర్యలు, నమ్మా టాయ్‌లెట్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల స్థితి గతుల నిర్వహణ తోపాటు సైన్ట్ఫిక్ డంపింగ్ యార్డు రూపకల్పన, లిట్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దు ప్రక్రియ, స్క్రాబ్ పార్కు రూపకల్పన, చెత్త సేగ్రిగేషన్, కాల్వగట్ల సుందరీకరణ, గ్రీనరీ, పోస్టర్ ఫ్రీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, తదితర అంశాలను కమిషనర్ కేంద్ర అధికారులకు వివరించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వే అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సహకరించాలని వీరపాండియన్ ఆదేశించారు. ఈ సమావేశంలో విఎంసి సిఇ అంకయ్య, సిఎంహెచ్‌ఓ గోపినాయక్, ఎస్‌ఇ లు పి ఆదిశేషు, జెవి రామకృష్ణ, ఇఇ గోవిందరావు, పివికె భాస్కర్ పాల్గొన్నారు. ఇదిలావుండగా సర్వేక్షణ్ సర్వే జరుగుతున్న నేపథ్యంలో నగర పరిసరాల పరిశుబ్రతలో శానిటేషన్ అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. రోడ్లు, మురుగుకాల్వల పరిశుబ్రతతోపాటు చెత్త రవాణా, తరలింపు తదితర చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైనం గమనార్హం.

వస్తల్రత గుమాస్తా బ్యాగ్‌లోని రూ. 2 లక్షల మాయం
పాతబస్తీ, జనవరి 17: పాతబస్తీలోని వస్తల్రత ఓ దుకారణంలో పని చేస్తున్న గుమస్తా మంగళవారం సాయంత్రం ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటోలోని ప్రయాణికులు రూ. 2 లక్షలు దోచుకున్నారు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం లంకా శివరామకృష్ణ (60) అనే వ్యక్తి వస్తల్రతలోని ఓ షాపులో గత కొనే్నళ్లుగా పని చేస్తున్నాడు. ఏలూరు రోడ్డులోని ఓ షాపుయజమాని తమకు డబ్బులు ఇవ్వాలని వాటిని తీసుకొని రావాల్సిందిగా శివరామకృష్ణకు తన యజమాని చెప్పాడు. దాంతో ఏలూరురోడ్డులోకి వచ్చిన శివరామకృష్ణ రూ. 2 లక్షలను తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. వస్తల్రతకు చేరేసరికి బ్యాగ్‌జిప్ తీసి ఉండటం గమనించాడు. బ్యాగ్‌లోని రూ. 2 లక్షలు మాయంకాగా వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం అతను షేన్ ఆటోలో రావటం వల్ల గుర్తు తెలియని దుండగులు అతని నగదు కాజేసినట్లు పోలీసులు గ్రహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.