విజయవాడ

మెట్రో రైల్ నిర్మాణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధికి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: నగరంలో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ కు అవరోధం కలుగకుండా ప్రత్యమ్నాయ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ అదేశించారు. ప్రత్యమ్నాయ రోడ్ల అభివృద్థిపై మెట్రో ప్రాజెక్టు అధికారులు కోరిన నివేదికను పురస్కరించుకొని ఆయా రోడ్లను పరిశీలించిన కమిషనర్ వీరపాండియన్ కరెన్సీ నగర్ మెయిన్ రోడ్డు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్ నుంచి పంటకాల్వ వరకు గల హైటెన్షన్ రోడ్డు, బందర్ రోడ్డు నుంచి స్కూృ బ్రిడ్జి వరకు వయా డొంక రోడ్డు, తదదితర ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి అనువైన రోడ్లను పరిశీలించారు. బందర్ కాల్వపై డొంకరోడ్డు గుల్జార్ బ్రిడ్జి, వైవి రావు హాస్పటల్ రోడ్డు ప్రాంతాల్లో మూడు వంతెనలు, తుమ్మలపల్లి కళాక్షేత్రం , పోలీస్ కంట్రోల్ రూమ్‌లలో 4 వంతెనల నిర్మాణాలకు అంచనాలను సిద్ధం చేయాలన్నారు. మెట్రో పనుల వలన నగర వాహనాలకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో సిఇ ఆర్ అంకయ్య, ఇఇ ధనుంజయ, పివికె భాస్కర్, సర్వేయర్ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

అజిత్‌సింగ్‌నగర్ సిఐ సస్పెన్షన్
విజయవాడ క్రైం, జనవరి 19: నగర పోలీసు కమిషనరేట్‌లోని అజిత్‌సింగ్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్ ప్రసాదరావుపై వేటుపడింది. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనపరుస్తున్నట్లు దృష్టికి రావటంతో నగర పోలీసు కమిషనర్ డి గౌతం సవాంగ్ సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ పోలీసు అధికారి అయిన ప్రసాదరావు గతంలో ఎస్‌ఐగా నగర పోలీసు కమిషనరేట్‌లోని వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేశారు. సిఐగా పదోన్నతి లభించాక సిఐడి విభాగంతోపాటు హైదరాబాద్, ఏలూరు రేంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ కమిషనరేట్‌లో అడుగుపెట్టిన సిఐ ప్రసాదరావు గవర్నర్‌పేట, కొత్తపేట, సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లలో పని చేశారు. గతంలో గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే పలు ఆరోపణలు రావటంతో అప్పటి పోలీసు కమిషనర్ ఏలూర్ రేంకు సాగనంపారు. అదే విధంగా సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో కూడా ఆయన వైఖరిలో మార్పు రాకపోవటంతో మరోసారి రేంజ్‌కు బదిలీ అయి కాకినాడులో కొంతకాలం పని చేశారు. గత ఎన్నికల ముందు ఇక్కడి నుంచి కాకినాడకు వెళ్లిన ఆయన కొన్ని నెలల క్రితమే కమిషనరేట్‌కు వచ్చారు. పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఆచీ తూచీ ఈయనకు ఎట్టకేలకు అజిత్‌సింగ్‌నగర్ సిఐగా పోస్టింగ్ కల్పించారు. అయితే సదరు అధికారి విధి నిర్వహణలో నిర్లక్ష్యం కనపర్చటంతోపాటు అవినీతి ఆరోపణలకు సంబంధించి గత కొద్దికాలంగా పోలీసు కమిషనరేట్ దృష్టికి పలు ఫిర్యాదు వచ్చాయి. దీంతోపాటు సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో అవకతవకలు చోటు చేసుకున్నట్లు సిపి విచారణలో తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సిఐను సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వుల్లో జారి చేశారు.