విజయవాడ

సిఆర్‌డిఎకు అధికారాలు కట్టబెడుతూ... పంచాయతీలను నిర్వీర్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: మైనర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీధి దీపాలకువచ్చే విద్యుత్ బిల్లులను, అలాగే అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఎపిసిఆర్‌డిఎ పరిధిలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు.గ్రామ సర్పంచుల కమిటీ రాష్ట్ర సమావేశం శుక్రవారం బందరు రోడ్డులోని మిడ్‌సిటీ హోటల్‌లో జరిగింది. ఇందులో పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల సర్పంచుల సంఘ నాయకులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎపిసిఆర్‌డిఎ పరిధిలోని గ్రామ పంచాయిలకు అందిన ఉత్తర్వు వలన గ్రామ పంచాయతీల పరిధిలోని లే అవుట్లు మరియు గృహ నిర్మాణాల ప్లాన్ నేరుగా ఎపిసిఆర్‌డిఎ వారికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ నమోదు చేసుకునే అవకాశం కల్పించుట వలన గ్రామ పంచాయితీలు నిర్వీర్యం చేయటమే అవుతుందని వెంకట్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సదరు ప్లాన్లు గ్రామ పంచాయతీల అనుమతుల ద్వారానే ఎపిసిఆర్‌డిఎకి వెళ్లేవిధంగా ఈ ఉత్తర్వులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీలకు రావలసిన పన్నుల వాటాను నేరుగా పంచాయితీలకు చెల్లించే విధంగా జీఓని సవరించాలని కూడా డిమాండ్ చేశారు.
సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలకు క్లస్టర్ విధానం జిఓఎమ్‌ఎస్ నెం.421 మరియు మెమో నెం 28239 జీఓ జారీ చేసి రెండు పంచాయతీలకు ఒకే కార్యదర్శి ఉండేవిధంగా నియమించినందున దీనిని తక్షణమే రద్దు చేసి అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు వుండే విధంగా చూడాలన్నారు. ప్రతి నెల సర్పచులకు గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామ పంచాయతీలలో ఉన్న డ్రైన్లు, రోడ్లు మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయుటకు ఉపాథి హామీ నిధుల ద్వారా పని మనుషులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో విధిగా సర్పంచులను కూడా ఆహ్వానించి శిలాఫలకాలపై సర్పంచ్ పేర్లను కూడా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.

భార్యను చంపిన భర్త
పాయకాపురం, జనవరి 20: తనకు భోజనం పెట్టలేదనే ఉక్రోశంతో భార్య మెడ కోసి చంపిన ఉదంతం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం చల్లా స్వాతి (25)కు చల్లా వెంకటేశ్వరరావుతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భర్త స్థానికంగా టిఫిన్ బండి నడుపుతున్నాడు. కాగా ఆర్థికంగా వీరిరువురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన భర్త తనకు భోజనం పెట్టమని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటేశ్వరరావు ఆమెను కత్తితో కంఠంపై కోసి అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికే స్వాతి మరణించింది. మృతికి సంబంధించి కారణాలను పోలీసులు అనే్వషిస్తున్నారు.