విజయవాడ

ఆధునిక, శాస్ర్తియ విధానాలతో అధిక దిగుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జనవరి 20: ఆధునిక, శాస్ర్తియ విధానల ద్వారా అధిక దిగుబడులు సాధించిన పొగాలకు రైతులను ఘనంగా సత్కరించారు. అసాధారణ వ్యవసాయ విధానాలు స్వీకరించడంతో పాటు పంట దిగుబడులను సాధించిన 17మంది పొగాకు రైతులకు అవార్డులను అందజేళశారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టుబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపిలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, వైవీ సుబ్బారెడ్డి, మాగంటి బాబు, గోకరాజు గంగరాజులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రైతులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో టీఐఐ డైరెక్టర్ సయ్యద్ మహమూద్ అహ్మద్ మాట్లాడుతూ ఆధునిక, శాస్ర్తియ వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంతో పాటుగా తమ నిరంతర ప్రయత్నానికి అంకిత భావం జోడించి అధిక దిగుబడులు, ఉత్పత్తి, నాణ్యతలతో దేశీయ సిగిరెట్ పొగాకును అంతర్జాతీయ పోటీలలో నిలిపి విజయం సాధించిన రైతుల కృషికి గుర్తింపుగా అవార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి దేశం భారత్‌లో పొగాకు సాగుకు సామాజిక-ఆర్థిక గుర్తింపు ఉందన్నారు. అతిపెద్ద ఎగుమతిదారునిగా ఉన్న మన దేశంలో పొగాకు సాగుపై లక్షలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారని అయితే అసాధారణ నియంత్రణ చర్యలు అయినటువంటి సిగిరెట్లపై అధిక పన్నులతో పాటు ఎక్కడా లేని రీతిలో భారీ చిత్రాలతో హెచ్చరికలు వంటివి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. దీని కారణంగానే ఎఫ్‌సీవీ టుబాకో రైతులు భారీస్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేశంలో దాదాపు 68శాతం నాన్ సిగిరెట్ పొగాకు ఉత్పత్తులు అసంఘటిత రంగంలోనే ఉత్పత్తి అవుతూ నిబంధనలను అతిక్రమించడంతో పాటు పన్నులను సైతం ఎగ్గొడుతున్నట్లు చెప్పారు. అన్ని పన్నులను ఎగవేయడంతో పాటు అక్రమంగా సిగిరెట్లను సైతం రవణా చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశపు సిగిరెట్ పరిశ్రమలో 1/5 వంతు అక్రమ సిగిరెట్లు ఆక్రమిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న అక్రమ సిగిరెట్లు కారణంగా చట్టబద్ధంగా పన్నులు చెల్లించే సిగిరెట్ వ్యాపారం గణనీయంగా పడిపోవడానికి కారణమవుతుందన్నారు. ఈ అవార్డు వేడుకల వద్ద పాల్గొన్న రైతులు తమ ఆందోళనను వెలిబుచిచడంతో పాటుగా భారతదేశంలో జరిగిన డబ్ల్యుహెచ్‌ఓ ఎఫ్‌సీటీసీ కాప్ 7 సమావేశంలో తమను దూరంగా ఉంచిన పరిస్థితిని వారు తప్పుపట్టారు. ప్రత్యక్షంగా లక్షలాది మంది పొగాకు రైతుల జీవనోపాధిపై ప్రబావం పడుతుందని, కాప్ 7 నిర్ణయాల వేళ తమకు కూడా భాగస్వామ్యం కల్పించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు భారత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు అభ్యర్థనలను తోసి పుచ్చారని తెలిపారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల తప్పుడు ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో పొగాకు అనేది అతి ముఖ్యమైన వాణిజ్య పంట, లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని అందించడంతో పాటుగా దేశానికి ఆదాయం, విదేశీ మారకద్రవ్యం సైతం అందిస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పొగాకు విధాన నిర్ణయాలలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం 17 మంది రైతులను ఘనంగా సత్కరించారు. అలాగే గోపాలపురం మండలం, చిట్యాల గ్రామానికి చెందిన గద్దే శేషగిరిరావుకు జీవత సాఫల్య పురస్కారం అందించారు.